Monkeypox Death: భారత్‌లో తొలి మంకీపాక్స్‌ మరణం.. కేరళలో కలకలం! పాజిటివ్ వచ్చినా చెప్పకుండా

Indias First Monkeypox Death in Thrissur, Kerala. భారత్‌లో తొలి మంకీపాక్స్‌ మరణం నమోదు అయింది. మంకీపాక్స్‌ వైరస్‌తో 22 ఏళ్ల యువకుడు మరణించినట్లు ప్రభుత్వం తెలిపింది.   

Written by - P Sampath Kumar | Last Updated : Aug 1, 2022, 07:46 AM IST
  • భారత్‌లో తొలి మంకీపాక్స్‌ మరణం
  • కేరళలో మంకీపాక్స్‌ కలకలం
  • పాజిటివ్ వచ్చినా చెప్పకుండా
Monkeypox Death: భారత్‌లో తొలి మంకీపాక్స్‌ మరణం.. కేరళలో కలకలం! పాజిటివ్ వచ్చినా చెప్పకుండా

Indias First Monkeypox Virus Death in Kerala: భారత్‌లో తొలి మంకీపాక్స్‌ మరణం నమోదు అయింది. మంకీపాక్స్‌ వైరస్‌తో 22 ఏళ్ల యువకుడు మరణించినట్లు కేరళ ప్రభుత్వం తెలిపింది. త్రిసూర్ జిల్లాలోని చావక్కాడ్ కురంజియూర్‌కు చెందిన యువకుడు శనివారం మంకీపాక్స్‌తో మరణించాడు. ఈ విషయంపై  కేరళ రాష్ట్ర వైద్యశాఖ మంత్రి వీనా జార్జ్ ఒక ప్రకటన విడుదల చేశారు. యూఏఈలో జరిపిన పరీక్షలో యువకుడికి పాజిటివ్ వచ్చినట్లు ఆయన తెలిపారు. ఈ మరణంతో దేశంలో ఒక్కసారిగా కలకలం రేగింది. 

మృతి చెందిన యువకుడు జులై 22న యూఏఈ  నుంచి భారత్‌కు వచ్చాడు. ఇక్కడికి రావడానికి ఒక్కరోజు ముందే (జులై 21) పరీక్షలు చేయించుకోగా.. అక్కడే మంకీపాక్స్ పాజిటివ్ అని నిర్ధారణ అయింది. పాజిటివ్ వచ్చినా విషయం చెప్పకుండా.. కొన్ని రోజులు బయటతిరిగాడు. అయితే తీవ్రమైన అలసట, మెదడు వాపుతో జులై 27న ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరాడు. చికిత్స పొందుతూ జులై 30 ఉదయం మరణించాడు. 

మంకీపాక్స్‌తో యువకుడు మృతి చెందడంతో కేరళ రాష్ట్రంలో కేసుల పరిస్థితిని తెలుసుకునేందుకు ఉన్నత స్థాయి విచారణకు కమిటీని వేసినట్లు ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ తెలిపారు. యువకుడి కాంటాక్ట్ లిస్ట్‌, రూట్ మ్యాప్ సిద్ధం చేశారు. కాంటాక్ట్ వ్యక్తులు ఐసోలేషన్‌లో ఉండాలని సూచించారు. ముఖ్యంగా కుటుంబ సభ్యులు ఇంటినుంచి బయటకు రావొద్దని ఆదేశాలు జారీ చేశారు. ఈ మరణంతో అక్కడి ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. 

భారతదేశంలో ఇప్పటివరకు నాలుగు మంకీపాక్స్‌ కేసులు నమోదు అయ్యాయి. అందులో మూడు కేసులు కేరళలోనే నమోదు కాగా.. ఒకటి ఢిల్లీలో నమోదైంది. ఇక మంకీపాక్స్‌ మరణంపై కేంద్రం అప్రమత్తమైంది. కేసులు నమోదవుతున్న రాష్ట్రాలు వెంటనే చర్యలు తీసుకోవాలని సూచించింది. మంకీపాక్స్‌ వైరస్‌పై నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వీకే పాల్ మాట్లాడుతూ.. వ్యాధిని అదుపులో ఉంచడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని, ప్రజలు భయాందోళనకు గురవ్వాల్సిన అవసరం లేదన్నారు. 

Also Read: Harmanpreet Kaur: ఎంఎస్ ధోనీ రికార్డును అధిగమించిన హర్మన్‌ప్రీత్‌.. తొలి కెప్టెన్‌గా అరుదైన ఘనత!  

Also Read: Horoscope Today August 1 2022: ఈరోజు రాశి ఫలాలు.. ఆ రాశుల వారికి ఊహించని లాభాలున్నాయి!  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి. Twitter , Facebook

Trending News