Lunar Eclipse July 2020: చంద్ర గ్రహణం ... ఈ ఏడాదిలో ఇప్పటికే రెండుసార్లు చంద్రగ్రహణం ఏర్పడింది. జనవరి 10న తొలిసారి చంద్ర గ్రహణం ఏర్పడగా.. జూన్ 5-6 నాటి రాత్రిన రెండోసారి చంద్రగ్రహణం ఏర్పడింది. ఆ తర్వాత జూన్ 21న సూర్య గ్రహణం ( Solar eclipse ) ఏర్పడిన సంగతి కూడా అందరికీ గుర్తుండే ఉంటుంది. ఆ తర్వాత అతి స్వల్ప వ్యవధిలోనే ముచ్చటగా మూడోసారి జూలై 5న ఆకాశంలో చంద్ర గ్రహణం ( Lunar eclipse ) కనువిందు చేయనుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

చంద్ర గ్రహణం వీక్షణం:
చంద్ర గ్రహణం మూడు రకాలు. ఒకటి పూర్తి చంద్ర గ్రహణం ( Total lunar eclipse )
కాగా రెండోది పాక్షిక చంద్ర గ్రహణం ( Partial lunar eclipse ) మూడోది ఉపఛాయ చంద్ర గ్రహణం ( Penumbral lunar eclipse ) అని అంటారు. ఈ చంద్రగ్రహణాన్నే ఉపచ్ఛాయ చంద్ర గ్రహణం అని కూడా అంటారు. చంద్ర గ్రహణం కొనసాగిన పూర్తి సమయంపాటు ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, ఆఫ్రికాలో పూర్తిగా కనిపించనుంది. అలాగే పసిఫిక్, హిందూ మహా సముద్రంలోని దీవులు, తీర ప్రాంతాల వాళ్లకు కూడా ఈ చంద్ర గ్రహణం కనిపించనుంది. ( Also read: Lunar eclipse: చంద్ర గ్రహణం ఆరోగ్యం, రాశీఫలాలపై ప్రభావం చూపిస్తుందా ? )


ఇండియాలో చంద్ర గ్రహణం టైమింగ్స్:
ఇండియాలో చంద్ర గ్రహణం టైమింగ్స్ విషయానికొస్తే ( Lunar eclipse timings in India ).. భారతీయ కాలమానం ప్రకారం జులై 5న ఉదయం 8.37కి ప్రారంభం కానున్న చంద్ర గ్రహణం.. 11.22 గంటల వరకు కొనసాగనుంది. చంద్ర గ్రహణం వీక్షించడానికి అవకాశం ఉండే ప్రాంతాల వాళ్లకు 9.59 గంటల నుంచి 11.22 గంటల మధ్య ప్రాంతంలో చంద్ర గ్రహణం స్పష్టంగా కనిపించే అవకాశాలున్నాయని ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే, చంద్ర గ్రహణం ఏర్పడిన సమయంలో భారత్‌లో పగటి వేళ ( Chandra grahan timings in India ) కావడంతో మిగతా ప్రాంతాల వారితో పోల్చుకుంటే భారతీయులకు చంద్ర గ్రహణం కనిపించే అవకాశం లేదు. ( Also read: 
Lunar Eclipse July 2020 : జూలై 5న చంద్రగ్రహణం విశేషాలివే )


భారత్‌లో చంద్ర గ్రహణం వీక్షించడానికి కనపడే అవకాశం లేనప్పటికీ.. చంద్ర గ్రహణాన్ని టెలిస్కోప్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేసే లైవ్ స్ట్రీమింగ్‌ వెబ్‌సైట్స్, యూట్యూబ్ ఛానెల్స్ ఉన్నాయి. వాటి ద్వారా చంద్ర గ్రహణాన్ని ఆన్‌లైన్‌లో వీక్షించే అవకాశం ఉంది. చంద్ర గ్రహణం వీక్షించాలనే ఆసక్తి ఉన్న వాళ్లు లైవ్ స్ట్రీమింగ్ ద్వారా వీక్షించొచ్చు.


సైన్స్ ప్రకారం సూర్యుడికి, చంద్రుడికి మధ్యలో భూమి అడ్డం వచ్చినప్పుడు సూర్య కాంతి చంద్రుడిపై పడకుండా భూమి అడ్డుకుంటుంది. అలా భూమి నీడ చంద్రుడిపై పడటంతో చంద్రుడు పూర్తిగా చీకట్లోకి వెళ్లిపోవడం వల్లే చంద్ర గ్రహణం ఏర్పడుతుంది.