Dysp romance controversy video in Karnataka: సమాజంలో ఎక్కడ అన్యాయాలు, అక్రమాలు జరిగిన కూడా అందరు పోలీసులను ఆశ్రయిస్తుంటారు. పోలీసు జాబ్ అంటే చాలా మంది ఎంతో ఉన్నతంగా భావిస్తుంటారు. సమాజంలో చాలా మంది ఖాకీ ఉద్యోగం చేయాలని, పోలీసు అవ్వాలని కూడా తాపత్రయపడుతుంటారు. కానీ కొంత మంది మాత్రమే తమ కోరికను నెరవేర్చుకుంటారు. పోలీసు ఉద్యోగం సాధించడం అంతే చాలా కష్టపడాల్సి ఉంటుందన్నమాట.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే.. అలాంటి గొప్ప ఉద్యోగంను సాధించిన  వారు సమాజంకు తమదైన విధంగా సేవలు అందిస్తున్నారు. కానీ మరికొందరు మాత్రం.. తమ  ఆ పవిత్రమైన ఉద్యోగానికి మచ్చను తీసుకొస్తున్నారు. తమకు అన్యాయం జరిగిందని.. పీఎస్ కు వచ్చిన వాళ్ల మీద కన్నేస్తున్నారు. ఫోన్ లు చేసుకుంటూ వేధిస్తు.. తమ కోరికను తీర్చాలని కామంతో రెచ్చిపోతున్నారు.


 



ఈక్రమంలో ప్రస్తుతం కర్ణాటకలో వెలుగులోకి వచ్చిన ఘటన  మాత్రం పోలీసు శాఖను ఉలిక్కిపడేలా చేసిందని చెప్పుకొవచ్చు.  మధుగిరి డీవైఎస్పీ రామ చంద్రప్ప.. మరో మహిళతో పోలీస్ స్టేషన్ లో రొమాన్స్ చేస్తు అడ్డంగా దొరికిపోయారు. ఒక భూమి వివాదం నేపథ్యంలో స్టేషన్ కు వచ్చిన బాధితురాలిని లొంగ దీసుకుని రెచ్చిపోయినట్లు తెలుస్తొంది. ఆమెతో సీక్రెట్ గా రొమాన్స్ చేస్తు నీచంగా ప్రవర్తించాడు.


Read more: Cobra snake Video: ఇదో పాముల లవ్ స్టోరీ..?.. ప్రియుడు చనిపోతే.. పక్కనే ఉండిపోయిన మరో పాము.. వీడియో ఇదే..


ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు మాత్రం షాక్ అవుతున్నారు.  పోలీసు శాఖ కూడా ఉలిక్కిపడినట్లు తెలుస్తొంది. మరోవైపు కర్ణాటక హోమంత్రి జి. పరమేశ్వరన్ సొంత జిల్లాలో ఈ ఘటన జరగడం ప్రస్తుతం తీవ్ర చర్చనీయాశంగా మారినట్లు తెలుస్తొంది. ప్రస్తుతం జిల్లా ఎస్పీ దీనిపై విచారణకు ఆదేశించినట్లు తెలుస్తొంది. సదరు డీవైఎస్పీ మాత్రం పరారీలో ఉన్నట్లు సమాచారం.



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.FacebookTwitter