Madhya Pradesh Election Result 2023: మధ్యప్రదేశ్ లో ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం.. ఆధిక్యంలో బీజేపీ..
Election 2023: మధ్యప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య హోరాహోరీ పోరు కొనసాగుతోంది. ప్రస్తుతం శివరాజ్‌సింగ్ చౌహాన్ నేతృత్వంలోని కాషాయ పార్టీ ఆధిక్యంలో ఉంది.
Madhya Pradesh Election Result 2023 Live Updates: ఉత్కంఠగా ఎదురుచూస్తున్న మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 52 జిల్లా కేంద్రాల్లో ఓట్ల లెక్కింపును చేపట్టారు. ఉదయం 09 గంటలకు లెక్కింపు పూర్తయ్యేసరికి బీజీపీ ఆధిక్యంలో ఉంది. దిమానీ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి శివరాజ్‌సింగ్ చౌహాన్, చింద్వారా నుంచి కాంగ్రెస్ అభ్యర్థి కమల్ నాథ్ ఆధిక్యంలో ఉన్నట్లు తెలుస్తోంది.
నవంబరు 17న 230 శాసనసభ స్థానాలకు ఒకే దశ పోలింగ్ జరిగింది. రాష్ట్రంలో ఈసారి అత్యధికంగా 76.22% పోలింగ్ నమోదు అయింది. 2018లో నమోదైన 75.63% కంటే ఎక్కువ. మధ్యప్రదేశ్ లో బీజేపీ, కాంగ్రెస్ మధ్య గట్టి పోటీ నెలకొంది. రాబోయే 2024 లోక్‌సభ ఎన్నికలలో బీజేపీకి గట్టి సవాలను విసిరేందుకు ప్రస్తుత ఎన్నికల్లో గెలవడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ పెట్టుకుంది. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటికీ.. కేవలం 15 నెలల మాత్రమే రాష్ట్రాన్ని పాలించింది. పార్టీలో అంతర్గత విభేదాల వల్ల అధికారాన్ని కోల్పోయింది. ఈ పదిహేను నెలల కాలాన్ని మినహాయించి 2003 నుంచి బీజేపీనే అధికారంలో ఉంది.
ఎగ్జిట్ పోల్స్ ఎటువైపు?
బీజేపీకి 140-162 సీట్లు రావచ్చని ఇండియా టుడే-యాక్సిస్ మై ఇండియా పోల్ అంచనా వేసింది. ఏబీపీ సీ-వోటర్ సర్వే ప్రకారం, కాంగ్రెస్‌కు 113 నుంచి 137 సీట్లు, బీజేపీకి 88 నుంచి 112 సీట్లు వస్తాయని పేర్కొంది.బిజెపికి 105-117 సీట్లతో పోలిస్తే 109-125 సీట్లు వచ్చే అవకాశం ఉందని టైమ్స్ నౌ ఇటిజి రీసెర్చ్ పోల్ పేర్కొంది. న్యూస్24-చాణక్య మరియు ఇండియా టీవీ సీఎన్ఎక్స్ పోల్స్ బీజేపీకి స్పష్టమైన మెజారిటీని ఇచ్చాయి. ఎన్డీటీవీ సర్వే 124 సీట్స్ బీజేపీకి, 102 సీట్స్ కాంగ్రెస్ కు వస్తాయని తెలిపింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి