Tulabharam News: కొడుకుకి తులాభారం, తూగిన 10 లక్షల్ని ఏం చేశాడో తెలుసా
Tulabharam News: తులాభారం గురించి తెలిసే ఉంటుంది. పూర్వపు రోజుల్లో బరువు తగ్గ ధనరాశుల్ని దానం చేసేవారు లేదా బహుకరించేవారు. రాజులు, జమీందార్ల కాలంలో సాగిన ఈ ఆచారం ఇప్పుడు కూడా లేకపోలేదు. అక్కడక్కడా ఇలాంటి ఘటనలు వెలుగు చూసున్నాయి.
Tulabharam News: అలాంటి ఘటనే మద్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది. ఉజ్జయినిలో జరిగిన ఈ సంఘటన చర్చనీయాంశంగా మారింది. తేజ దశమి పండుగ పురస్కరించుకుని ఓ తండ్రి చేసిన తులాభారమిది. ఆశ్చర్యంగా ఉందా..కానీ నిజమే ఇది. పూర్తి వివరాలు మీ కోసం.
మద్యప్రదేశ్ రాష్ట్రం ఉజ్జయిని జిల్లా బాద్‌నగర్‌లో జరిగిన తేజ దశమి పండుగ సందర్భం. బాద్‌నగర్‌కు చెందిన చతుర్బుజ్ జాట్ అందర్నీ ఆశ్చర్యపరిచాడు. తన 30 ఏళ్ల కుమారుడికి నోట్లతో తులాభారం వేశాడు. 82 కిలోల వయస్సు కలిగిన తన కుమారుడు వీరేంద్రను 10 రూపాయల నోట్ల కట్టలతో తూగించాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. త్రాసులో ఓ వైపు కుమారుడిని కూర్చోబెట్టి మరోవైపు 10 రూపాయల నోట్ల కట్టలు ఉంచగా 10 లక్షల 7 వేల రూపాయలు తూగాయి. ఈ మొత్తం డబ్బుల్ని ఆలయ నిర్మాణానికి విరాళం ఇచ్చాడు.
4 ఏళ్ల క్రితం తాను అనుకున్న నెరవేరితే తేజాజీ మహారాజ్ ఆలయం నిర్మాణానికి తన కుమారుడి బరువుకు తగ్గ డబ్బుల్ని దానమిస్తానని మొక్కుకున్నాడు. ఇప్పుడా కోరిక నెరవేరడంతో తన కుమారుడి బరువుకు తగ్గ 10 లక్షల 78 వేల రూపాయల్ని విరాళమిచ్చాడు. ఈ విషయం తెలియగానే పెద్దఎత్తున గ్రామస్థులు ఆలయ ప్రాంగణానికి చేరుకున్నారు. అతని వినూత్న విరాళానికి ఆశ్చర్యపోయారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఓ తండ్రి చేసిన తులాభారంతో బాద్‌నగర్ తేజేజీ దశమి ఆలయం వార్తల్లోకెక్కింది.
Also read: VIVO X200 Pro launch: 16GB Ram,9400 డైమెన్సిటీతో వివో నుంచి కొత్త ఫోన్ VIVO X200 Pro
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.