Vat on Fuel : ఇంధన ధరలపై వ్యాట్ ఎక్కువ ఆ రెండు రాష్ట్రాల్లోనే
Vat on Fuel: తిలాపాపం తలాపిడికెడు సామెత ఇంధన ధరలకు సరిగ్గా సరిపోతుంది. పెట్రోల్-డీజిల్ ధరలు ఆకాశాన్నంటడానికి కారణం అన్ని రకాల పన్నులు. ఆ రెండు రాష్ట్రాలు మాత్రం అందరికంటే ఎక్కువ వసూలు చేస్తున్నాయి.
Vat on Fuel: తిలాపాపం తలాపిడికెడు సామెత ఇంధన ధరలకు సరిగ్గా సరిపోతుంది. పెట్రోల్-డీజిల్ ధరలు ఆకాశాన్నంటడానికి కారణం అన్ని రకాల పన్నులు. ఆ రెండు రాష్ట్రాలు మాత్రం అందరికంటే ఎక్కువ వసూలు చేస్తున్నాయి.
దేశంలో ఇంధన ధరలు (Fuel Prices) ఆకాశాన్నంటుతున్నాయి. అన్ని రాష్ట్రాల్లోనూ సెంచరీ మార్క్ ఎప్పుడో దాటేసి..ఇంకా పైకి పరిగెడుతోంది. ఇంధన ధరలు ఆకాశాన్నంటడానికి కారణం వివిధ రకాల పన్నులు. ఇందులో ఆయా రాష్ట్రాలు విధించే వ్యాట్ ప్రధానంగా ఉంది. అయితే ఈ వ్యాట్ ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలా ఉంది. వివిధ రాష్ట్రాల్లో పెట్రోల్-డీజిల్ ధరలపై వసూలు చేస్తున్న వ్యాట్ వివరాల్ని కేంద్ర చమురుశాఖ మంత్రి హర్దీప్ పూరి లోక్‌సభలో ఓ ప్రశ్నకు సమాధానంగా వివరించారు. దేశంలో ఈ నెలలోనే పెట్రోల్, డిజిల్ ధరలు(Petrol-Diesel Prices) గరిష్ఠ స్థాయికి పెరిగినట్టు చెప్పారు. మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాలే అత్యధికంగా వ్యాట్ వసూలు చేస్తున్నాయని కేంద్రమంత్రి (Union minister hardeep puri) తెలిపారు.
మధ్యప్రదేశ్ (Madya pradesh)ప్రభుత్వం పెట్రోల్‌పై అత్యధికంగా వ్యాట్ వసూలు చేస్తుంటే..రాజస్థాన్ (Rajasthan) ప్రభుత్వం డీజిల్‌పై అత్యధికంగా వ్యాట్ వసూలు చేస్తోంది. పెట్రోల్, డీజిల్ ధరల్లో 55 నుంచి 50 శాతం రాష్ట్ర ప్రభుత్వాలు విధిస్తున్న పన్నులే ఉంటున్నాయని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం(Central government)పెట్రోల్‌పై 32.90 రూపాయులు, డిజిల్‌పై 31.80 రూపాయల చొప్పున ఎక్సైజ్ డ్యూటీ విధిస్తుంటే..మిగిలినదంతా రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాట్ రూపంలో వసూలు చేస్తున్నాయని కేంద్రమంత్రి తెలిపారు. దేశం మొత్తం మీద అండమాన్ నికోబార్ దీవుల్లో వ్యాట్ అతి తక్కువగా ఉందన్నారు. పెట్రోల్‌పై 4.82 రూపాయలు కాగా, డీజిల్‌పై 4.74 రూపాయలుగా ఉంది. మధ్యప్రదేశ్‌లో మాత్రం పెట్రోల్‌పై 31.55 రూపాయలుంటే..రాజస్థాన్‌లో డీజిల్‌పై 21.82 రూపాయలుంది.
Also read: Indian Railways: ఇండియన్ రైల్వే స్ నుంచి త్వరలో ఏసీ ఎకానమీ కోచ్‌లు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook