చెన్నై : తమిళనాడులో మద్యం ప్రియులకు, ఆ రాష్ట్ర సర్కార్‌కి మద్రాస్ హై కోర్టు ( Madras high court ) షాక్ ఇచ్చింది. తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో తమిళనాడు స్టేట్ మార్కెటింగ్ కార్పొరేషన్ ( TASMAC liquor) నిర్వహించే అన్ని మద్యం దుకాణాలను మూసివేయాలని మద్రాస్‌ హైకోర్టు శుక్రవారం ఆదేశాలు జారీచేసింది. మద్యాన్ని కేవలం ఆన్‌లైన్‌లోనే విక్రయించి డోర్ డెలివరీ చేసుకోవచ్చని మద్రాస్ హై కోర్టు స్పష్టం చేసింది. వివరాల్లోకి వెళ్తే.. మద్యం దుకాణాల వద్ద సోషల్ డిస్టన్సింగ్ పాటించడం లేదని ఫిర్యాదు చేస్తూ ప్రముఖ సినీనటుడు, మక్కల్ నీది మయ్యం అధ్యక్షుడు కమల్ హాసన్ సహా పలువురు న్యాయవాదులు, పౌరులు హైకోర్టులో పిటిషన్స్ దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై విచారణ చేపట్టిన హైకోర్టు ఈమేరకు ఆదేశాలు జారీ చేసింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also read : కరోనా కేసులు పెరిగాయని మునిసిపల్ కమిషనర్‌పై బదిలీ వేటు


తమిళవాడులో మే 7వ తేదీ నుంచే మద్యం విక్రయించబడును అని ఆ రాష్ట్ర ప్రభుత్వం మే 4వ తేదీన చేసిన ప్రకటన తీవ్ర వివాదస్పదమైంది. దీనిని వ్యతిరేకిస్తూ చాలామంది హై కోర్టుకు వెళ్లారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయంపై స్టే విధించినప్పటికీ.. మద్యం విక్రయాలకు అనేక షరతులు విధిస్తూ మే 6న హై కోర్టు తీర్పు చెప్పింది.


Also read : Vizag gas leak tragedy : మరో ఇద్దరు మృతి, రూ. 30 కోట్ల ఎక్స్‌గ్రేషియా విడుదల


ఇదిలావుండగా, మే 7న మద్యం అమ్మకాలు జరిగిన చోట మద్యం షాపుల వద్ద హై కోర్టు విధించిన నిబంధనలను ఎవ్వరూ పాటించడం లేదని, ఫలితంగా భౌతిక దూరం పాటించాలనే లక్ష్యం కూడా దెబ్బ తింటోందని మరోసారి పలువురు హై కోర్టు మెట్లెక్కారు. ఈ పిటిషన్లను విచారణకు స్వీకరించిన హై కోర్టు.. ఈసారి మద్యం దుకాణాలు మూసేయాల్సింగా ఆదేశిస్తూ.. ఆన్‌లైన్‌లో విక్రయించుకోవాల్సిందిగా సూచించింది. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..