Madhya pradesh crisis: ఈ దౌర్భాగ్య స్థితికి ఆ పార్టీయే ప్రధాన కారణం..
మధ్య ప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ పంచాయతీ సుప్రీం కోర్టుకు చేరిందా? అయితే గత కొన్ని రోజులుగా రాజకీయ సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోంది. మద్యప్రదేశ్ అసెంబ్లీలో బలపరీక్ష మార్చి 26కు వాయిదా పడడంపై భారతీయ జనతా పార్టీ (బీజేపీ) సుప్రీంకోర్టును ఆశ్రయించింది. వెంటనే బలపరీక్ష చేపట్టాలని
భోపాల్: మధ్య ప్రదేశ్ రాష్ట్ర(MP Crisis)అసెంబ్లీ పంచాయతీ సుప్రీం కోర్టుకు చేరిందా? అయితే గత కొన్ని రోజులుగా రాజకీయ సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోంది. మద్యప్రదేశ్ అసెంబ్లీలో బలపరీక్ష మార్చి 26కు వాయిదా పడడంపై భారతీయ జనతా పార్టీ (బీజేపీ) సుప్రీంకోర్టును ఆశ్రయించింది. వెంటనే బలపరీక్ష చేపట్టాలని కోరుతూ మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సహా 10 మంది ఎమ్మెల్యేలు ఈ పిటిషన్ దాఖలు చేశారు.
Read Also: అన్ని హ్యాండ్ శానిటైజర్‌లు ఒకేలా ఉండవు..!!
కాగా అధికార కాంగ్రెస్‌కు చెందిన 22 మంది ఎమ్మెల్యేలు తమ రాజీనామాను సమర్పించారని, తద్వారా మధ్యప్రదేశ్ ప్రభుత్వం మైనార్టీలో పడిపోయిందని తమ పిటిషన్‌లో పేర్కొన్నారు. పిటిషన్‌లో సోమవారం నాడు గవర్నర్ బలపరీక్ష నిర్వహించాలని ఆదేశించారని, అసెంబ్లీలో పద్దులపై చర్చ జరపాలని సూచించినప్పటికే అది జరగలేదని అన్నారు. ఈ పిటిషన్ పై సుప్రీంకోర్టు మంగళవారం విచారించే అవకాశం ఉందని తెలిపారు.
Read Also: 'కమలం'పై కేసీఆర్ కన్నెర్ర
బడ్జెట్ సమావేశాలు ఉదయం ప్రారంభం కాగానే గవర్నర్ లాల్జీ టాండన్ ప్రసంగం తరువాత సభను మార్చి 26 వరకు వాయిదా వేశారు. అసెంబ్లీలో సభ్యులకు గవర్నర్ విజ్ఞప్తి చేస్తూ.. సభ సజావుగా నడిచేలా సహకరించాలని, రాజ్యాంగం ప్రకారం నియమ నిబంధనలు పాటించాలని తద్వారా మధ్యప్రదేశ్ గౌరవం రక్షించబడుతుందని అన్నారు. మరోవైపు అసెంబ్లీలో కాసేపు గందరగోళం చోటుచేసుకుంది. గవర్నర్ ఆదేశాల మేరకు బలపరీక్ష నిర్వహించాలని ప్రతిపక్ష నాయకులు స్పీకర్ ను అభ్యర్థించారు. ప్రభుత్వానికి బల నిరూపణకు తగిన మెజారిటీ లేకపోవడంతో ముఖ్యమంత్రి కమల్ నాథ్ నైతికంగా రాజీనామా చేయాలని పట్టుబట్టారు.
ఇది కూడా చదవండి: sensex: భారత స్టాక్ మార్కెట్లకు మరో బ్లాక్ మండే
జ్యోతిరాదిత్య సింధియా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లో చేరడంతో రాష్ట్ర రాజకీయం సంక్షోభంలో పడింది. తన విధేయులైన 22 మంది పార్టీ ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతో కాంగ్రెస్ తీవ్ర నష్టాల్లో కూరుకుపోయింది. 228 మంది సభ్యులున్న సభలో కాంగ్రెస్ 114 ఎమ్మెల్యేలుండగా 22 మంది శాసనసభ్యుల రాజీనామా నేపథ్యంలో కమల్ నాథ్ సర్కార్ మైనార్టీలో పడిపోయింది.
ఇదే అంశంఆపై సీఎం కమల్ నాథ్ మాట్లాడుతూ.. శాసన సభలో బలపరీక్షకు భయపడమని, స్పీకర్ నిర్ణయాన్ని గౌరవిస్తామని గవర్నర్‌కు తెలియజేశారు. రాష్ట్రంలో ఇటువంటి దౌర్భాగ్య పరిస్థితికి, రాజకీయ సంక్షోభానికి ప్రధాన కారణం బీజేపీయేనని సీఎం కమల్ నాథ్ ఆరోపించారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..