Badlapur News ఉలిక్కి పడిన బద్లాపూర్.. నర్సరీ బాలికలపై వాష్ రూమ్ లో అత్యాచారం.. రంగంలోకి ఎన్ హెచ్ఆర్సీ..
Badlapur Molestation Case: మహరాష్ట్రలోని బద్లాపూర్ లో జరిగిన ఘటనతో దేశం మరోసారి ఉలిక్కిపడిందని చెప్పుకొవచ్చు. అభంశుభం ఎరుగని నర్సరీ చిన్నారులపై కామాంధులు.. బాత్రూమ్ లో అఘాయిత్యానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది..
Maharashtra Badlapur Thane school sexual abuse case: మహారాష్ట్ర రణరంగంగా మారిపోయింది. ఇద్దరు అభం శుభం తెలియని చిన్నారులపై .. స్వీపర్ దారుణానికి ఒడిగట్టాడు. ఠానె జిల్లాలోని బద్లాపూర్ లోని ఒక స్కూల్ లో.. ఈ అమానవీయకర సంఘటన చోటు చేసుకుంది. నాలుగేండ్ల చిన్నారులపై అత్యాచారం ఘటనతో.. మహరాష్ట్రలో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆగస్టు 12, 13 తేదీల్లో ఈ ఘటనలు జరిగినట్లు యాజమాన్యంకు తెలిసిన.. ఏమాత్రం పట్టించుకోలేదని తెలుస్తుంది. చిన్నారుల్లో ఒకరు స్కూల్ కు వెళ్లడానికి భయపడిపోతుండగా.. వారిని తల్లిదండ్రులు వాకాబుచేశారు. అప్పుడు దారుణం వెలుగులోకి వచ్చింది. డాక్టర్ వద్దకు తీసుకెళ్లగా.. ఇద్దరిపైన లైంగిక దాడి జరిగిన విషయంవెలుగులోకి వచ్చింది.
దీంతో బద్లాపూర్ రణరంగంగా మారిపోయింది. బాధితుల కుటుంబ సభ్యులు, స్కూల్ పై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన పై మహారాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు మిన్నంటాయి. రైల్వేలు, బస్సులు ఎక్కడికక్కడ.. నిలిచిపోయాయి. రోడ్లమీద, రైల్వే ప్లాట్ ఫామ్ మీద నిరసనలు చేపట్టారు. మరోవైపు పోలీసులు ఫిర్యాదు తీసుకునేందుకు దాదాపు..12 గంటలపాటు బాధితుల తల్లిదండ్రులను వేచి ఉండేలా చేశారంట. దీంతో ఈ ఘటన మరింత ఆగ్రహానికి గురిచేసేదిగా మారింది. తమకు న్యాయం చేయాలిన బాధితులు కుటుంబ సభ్యులు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనలో ఇప్పటికే పోలీసులు నిందితుడు అక్షయ్ షిండే ను అరెస్టు చేసినట్లు తెలుస్తోంది.
మరోవైపు స్వీకర్ అత్యాచారానికి ఆగ్రహించిన జనాలు.. రైల్వే ట్రాక్ ల మీద కూర్చుని తమ నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. 7 గంటలుగా రైల్వే ట్రాక్ లపై రైల్ రోకో చేపట్టడంతో పలు రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మరోవైపు దీనిపైన మహా ప్రభుత్వం.. మహిళ ఐపీఎస్ తో దర్యాప్తు చేపిస్తున్నట్లు వెల్లడించింది. ఈ క్రమంలో ఐజీ ర్యాంకు కల్గిన ఐపీఎస్ అధికారిణి ఆర్తిసింగ్ ను దర్యాప్తు అధికారిణిగా నియమించారు.
సుమోటోగా రంగంలోకి దిగిన ఎన్‌హెచ్‌ఆర్‌సి..
థానే జిల్లాలోని పాఠశాల వాష్‌రూమ్‌లో ఇద్దరు నాలుగేళ్ల బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటనపై ఎన్‌హెచ్‌ఆర్‌సి సుమోటోగా రంగంలోకి దిగింది. అదే విధంగా.. ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడంలో జాప్యంపై సమగ్ర నివేదిక ఇవ్వాలని జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్‌ఆర్‌సి) మంగళవారం మహారాష్ట్ర అధికారులను కోరింది. విషయం. థానేలోని బద్లాపూర్ స్టేషన్‌లో వేలాది మంది నిరసనకారులు రైల్వే ట్రాక్‌లను అడ్డుకుని, స్థానిక పాఠశాల భవనాన్ని ముట్టడించిన నేపథ్యంలో.. కమిషన్ ఈ కేసును సుమోటోగా పరిగణలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.
Read more: Amrapali: కీలక పదవి కొట్టేసిన ఆమ్రాపాలీ.. మరోసారి తెలంగాణలో ఆరుగురు ఐఏఎస్ బదిలీలు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి