Amrapali: కీలక పదవి కొట్టేసిన ఆమ్రాపాలీ.. మరోసారి తెలంగాణలో ఆరుగురు ఐఏఎస్ బదిలీలు..

6 IAS Transferes in Telangana: తెలంగాణలో ప్రభుత్వం మరోసారి బదిలీలను నిర్వహించింది. ఈ క్రమంలో ఇప్పటికే పలువురు ఐఏఎస్, ఐపీఎస్ లకు స్థాన చలనం కల్గించిన రేవంత్ సర్కారు.. మరోసారి ఆరుగురు ఐఏఎస్ అధికారులను బదిలీలు చేస్తు సీఎస్ శాంతికుమారీ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. 

1 /6

తెలంగాణలో మరోసారి ఐఏఎస్ అధికారులను బదిలీచేస్తు సీఎస్ శాంతి కుమారీ  ఉత్తర్వులు జారీ చేశారు.ఈ ట్రాన్స్ ఫర్స్ లలో డైనమిక్ లేడీ ఐఏఎస్ కాట ఆమ్రాపాలీకి కీలక పదవి దక్కినట్లు తెలుస్తోంది.

2 /6

సాధారణ బదిలీల్లో భాగంగా తెలంగాణలో మరోసారి ఆరుగురు అధికారులను బదిలీచేసినట్లు తెలుస్తోంది. దీనిలో భాగంగా.. మూసీ రివర్ డెవలప్ మెంట్ ఎండీదా దాన కిషోర్ ను నియమించింది.

3 /6

అదే విధంగా.. హెచ్ఎండీఏ జాయింట్ కమిషనర్ గా కోట శ్రీవాత్సవను నియమించింది. అంతేకాకుండా.. కరీంనగర్ మున్సిపల్ కమిషనర్ గా.. ఛాహత్ బాజ్ పేయ్ ను బదిలీ చేసింది.. 

4 /6

హైదరాబాద్ వాటర్ వర్క్స్ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ గా.. మయాంగ్ మిట్లల్ ను నియమించింది. హెచ్ జీ సీ ఎల్ ఎండీగా సర్పరాజ్ కు అదనపు బాధ్యతలు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తాజా బదీలీలు వార్తలలో నిలిచాయి. 

5 /6

దీనిలో ముఖ్యంగా జీహెచ్ఎంసీ కమిషనర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న.. కాట ఆమ్రపాలీకి జీహెచ్ఎంసీ పూర్తిస్థాయి కమిషనర్ గా బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి.  గతంలో ఆమ్రపాలీకి అదనంగా ఉన్న  కొన్ని బాధ్యతలను ప్రభుత్వం తప్పించింది. ప్రస్తుతం జీహెచ్ఎంసీ పరిధిలో ఆమ్రపాలీ తనదైన మార్కు చూపిస్తున్నారు.

6 /6

జియోట్యాగింగ్ లో కూడా హైదరాబాద్ వాసులకు ఉన్న అనుమానాలను క్లియర్ చేస్తున్నారు. ప్రజల మధ్యన తిరుగుతూ వారి సమస్యలు అడిగి మరీ తెలుసుకుంటున్నారు. ఇటీవల పార్కింగ్ లో అధిక వసూళ్లు, చెరువుల కబ్జా, కుక్కల విషయంలో కూడా ఫిర్యాదులపై సీరియస్ గాచర్యలు తీసుకున్నారు.