విద్యా, ఉద్యోగావకాశాల్లో 16 శాతం రిజర్వేషన్లు కల్పించాలంటూ మహారాష్ట్రలో మారాఠాలు చేస్తున్న ఆందోళనలు పలుచోట్ల హింసాత్మకంగా మారాయి. ఉద్యోగావకాశాల్లో రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్‌ చేస్తూ మరాఠాలు ఇవాళ రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చారు. నిన్న గోదావరి నదిలో రిజర్వేషన్ల కోసం ఓ యువకుడు గోదావరి నదిలో దూకి ఆత్మహత్య చేసుకోవడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. పర్భణి, ఔరంగాబాద్‌లో ఆందోళనకారులు ఆర్టీసీ బస్సులను ధ్వంసం చేశారు.



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 


'మహారాష్ట్ర ప్రభుత్వం మరాఠా క్రాంతి మోర్చా డిమాండ్లను చాలావరకూ ఆమోదించింది. రిజర్వేషన్ల డిమాండ్‌కు సంబంధించిన నివేదికను త్వరలో ప్రభుత్వానికి అందజేస్తాం. నదిలో దూకి చనిపోయిన యువకుడి కుటుంబానికి 10 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియాను అందిస్తాం. అతని కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తాం' అని ఔరంగాబాద్ డీఎం ఉదయ్ చౌదరి తెలిపారు.



 


సీఎం పర్యటన రద్దు


ఆషాఢ ఏకాదశి సందర్బంగా పండరీపురంలో పూజకు వచ్చే సీఎం ఫడ్నవీస్‌ను అడ్డుకుంటామని పలు మరాఠా సంఘాలు హెచ్చరించాయి. దీంతో ఇంటెలిజెన్స్ హెచ్చరికల మేరకు సీఎం పండరీపురం పర్యటనను రద్దు చేసుకున్నారు. మరాఠా సంఘాలు ఆందోళనకు దిగుతామని హెచ్చరించాయి. అందుకే భక్తులకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు పర్యటనను రద్దు చేసుకున్నారని సంబంధిత ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. మరాఠా రిజర్వేషన్ల విషయం హైకోర్టులో ఉందని.. మరాఠా యువత భవిత ప్రమాదంలో పడకుండా చూస్తానని సీఎం  ఫడ్నవీస్‌ తెలిపారు.