Wine in supermarkets: మందు బాబులకు మహారాష్ట్ర సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. వైన్​ అమ్మకాలపై తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. పెద్ద పద్ద సూపర్​ మార్కెట్లలో కూడా వైన్​ అమ్మకాలకు అనుమతినిస్తూ.. ఆ రాష్ట్ర కేబినెట్ తాజాగా నిర్ణయం (Wine sales in supermarkets) తీసుకుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న సూపర్ మార్కెట్లకు మాత్రమే ఈ అనుమతి ఉంటుందని ఆ రాష్ట్ర సీనియర్​ మంత్రి నవాబ్​ మాలిక్ వెల్లడించారు. 'షెల్ఫ్​​ ఇన్​ షాప్​' పాలసీ కింద ఈ అనుమతులు ఇస్తున్నట్లు (Maharashtra new Liquor Policy) వివరించారు.


లిక్కర్​ ఉత్పత్తిదారులు మహారాష్ట్రలో తమ వ్యాపారాలను మరింత విస్తరించేందుకు ఈ నిర్ణయం ఉపయోగపడనుందన్నారు.


ఈ నిర్ణయం అందుకే..


పండ్ల రైతుల ఆదాయం పెంచేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు మహారాష్ట్ర మైనారిటీ అభివృద్ధి శాఖ మంత్రి నవాబ్​ మాలిక్​. పండ్ల ద్వారా ఉత్పత్తి చేసే వైన్​ విక్రయాలు పెరిగితే.. రైతులకు కూడా ఆదాయం పెరుగుతుందని (Nawab Malik on Maharashtra new Liquor Policy) వివరించారు.


ఈ నిర్ణయాన్ని మహారాష్ట్ర బీజేపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. తాగుబోతులను పెంచుతోందటూ (BJP on Maharashtra new Liquor Policy) మండిపడింది.


ఆయితే ఈ విషయంపై నవాబ్ మాలిక్ బీజేపీపై విమర్శలు చేశారు. బీజేపీ అధికారంలో ఉన్న గోవాలో ఇదే పాలసీ ఉందని గుర్తు చేశారు. అందుకే బీజేపీకి ఈ నిర్ణయాన్ని తప్పుబట్టే అర్హత లేదన్నారు.


మహారాష్ట్రలో వైన్ విక్రయాలు, ఉత్పత్తి వివరాలు..


మహారాష్ట్రలో సగటున ప్రతి ఏటా 70 లక్షల లీటర్ల వైన్ విక్రయమవుతోంది. కొత్త పాలసీతో కోటి లీటర్లకు విక్రయాలు పెరుగుతాయని భావిస్తోంది (Maharashtra liquor sales) ప్రభుత్వం.


దేశంలో వైన్​ పరిశ్రమ టర్నోవర్ రూ.1,000 కోట్లుగా ఉండగా.. అందులో 65 శాతం ఒక్క మహారాష్ట్ర నుంచే కావడం గమనార్హం. ఒక్క నాసిక్​లోనే దేశీయంగా 80 శాతం వరకు వైన్ ఉత్పత్తి అవుతోంది. ఆ తర్వాతి స్థానాల్లో సంగ్లీ, పుణే, సోలాపూర్​, బుల్దానా, అహ్మద్​నగర్​లు (Maharashtra liquor production) ఉన్నాయి.


Also read: Tamilnadu: తమిళనాడులో కోవిడ్ ఆంక్షల సడలింపు.. నైట్ కర్ఫ్యూ, సండే లాక్‌డౌన్ ఎత్తివేత...


Also read: BREAKING: కోవిడ్ మార్గదర్శకాలు ఫిబ్రవరి 28 వరకు పొడగింపు.. కేంద్రం ఉత్తర్వులు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook