Covid 19 Guidelines Extended: ప్రస్తుతం దేశవ్యాప్తంగా అమలులో ఉన్న కోవిడ్ మార్గదర్శకాలను కేంద్రం ఫిబ్రవరి 28 వరకు పొడగించింది. ఒమిక్రాన్ కేసుల సంఖ్య పెరుగుతుండటం, దేశంలోని 407 జిల్లాల్లో ఇప్పటికీ 10 శాతానికి పైగా కరోనా పాజిటివిటీ రేటు ఉండటంతో కోవిడ్ మార్గదర్శకాలను పొడగిస్తున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ సెక్రటరీ అజయ్ భల్లా రాష్ట్రాలకు ఉత్తర్వులు జారీ చేశారు.
'దేశంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 22 లక్షల పైచిలుకుకు చేరింది. మెజారిటీ పేషెంట్లు త్వరగానే రికవరీ అవుతున్నప్పటికీ.. ఆసుపత్రిలో చేరుతున్న కేసుల సంఖ్య తక్కువగానే ఉన్నప్పటికీ.. ఇప్పటికీ దేశంలోని 407 జిల్లాల్లో కరోనా పాజిటివిటీ రేటు 10 శాతానికి పైనే ఉండటం ఆందోళన కలిగించే విషయం. కాబట్టి అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు కరోనా కట్టడికి తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం.' అని ఉత్తర్వుల్లో అజయ్ భల్లా పేర్కొన్నారు.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా నిత్యం 2 లక్షల పైచిలుకు కేసులు నమోదవుతున్నాయి. రెండు, మూడు రోజుల క్రితం వరకూ 3 లక్షల పైచిలుకు కేసులు నమోదవగా ప్రస్తుతం ఆ సంఖ్య 2 లక్షల మార్క్‌కి చేరింది. కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గినప్పటికీ ఇప్పటికీ చాలా జిల్లాల్లో పాజిటివిటీ రేటు తగ్గకపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలోనే కోవిడ్ మార్గదర్శకాలను కేంద్రం మరోసారి పొడగించింది.
గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 2,86,384 మంది కరోనా (Covid 19) బారినపడిన సంగతి తెలిసిందే. మరో 573 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. తాజా కేసులతో కలిపి మొత్తం కరోనా కేసుల సంఖ్య 4.03 కోట్లకు చేరింది. ఇప్పటివరకూ 4,91,700 మంది కరోనాతో మృతి చెందారు. ప్రస్తుతం కోవిడ్ పాజిటివిటీ రేటు 19.59 శాతంగా ఉంది. ఫిబ్రవరిలో కరోనా పీక్స్‌కి చేరే అవకాశం ఉన్నట్లు నిపుణులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో ముఖానికి మాస్కు, వ్యక్తిగత దూరం వంటి జాగ్రత్తలను నిర్లక్ష్యం చేయవద్దని వైద్యారోగ్య శాఖ సూచిస్తోంది.
Also Read: Video: గ్యాంగ్ రేప్ బాధితురాలిపై అమానుషం.. గుండు గీసి వీధుల్లో ఊరేగించిన మహిళలు
Also read: Mahesh Bank: సైబర్ దాడి కేసులో పోలీసుల చేతికి కీలక ఆధారాలు.. అదుపులో నిందితుడు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook