ముంబై: ఉద్ధవ్ థాకరే గురువారం సాయంత్రం మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయడంతో గత కొన్ని వారాలుగా ఆ రాష్ట్రంలో నెలకొన్ని రాజకీయ సంక్షోభానికి తెరపడినట్టయింది. 1966లో శివసేన పార్టీ ఏర్పాటుపై తొలిసారిగా ప్రకటన చేస్తూ బాల్ థాకరే తొలి ర్యాలీ చేపట్టిన శివాజీ పార్కులోనే ఉద్ధవ్ థాకరే ప్రమాణస్వీకారం(Uddhav Thackeray takes oath as CM) చేశారు. ఆ రాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కొశ్యారి మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉద్ధవ్ థాకరే చేత ప్రమాణస్వీకారం చేశారు. ఉద్ధవ్ థాకరేతోపాటు శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీల నుంచి పలువురు కీలక నేతలు ప్రమాణస్వీకారం చేసిన వారిలో ఉన్నారు. మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు చేసే ప్రక్రియ ముగిసింది కనుక ఇక వెంటనే పూర్తి చేయాల్సిన మరో పని ఏదైనా ఉందా అంటే అది 288 స్థానాలు ఉన్న మహారాష్ట్ర అసెంబ్లీలో డిసెంబర్ 2న జరగనున్న బల పరీక్షలో ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే తన బలాన్ని నిరూపించుకోవడమే. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Read also : ఆ తర్వాతే అజిత్ పవార్ చేత ప్రమాణస్వీకారం: శరద్ పవార్


ఈ నేపథ్యంలో బల పరీక్ష ముగిసిన వెంటనే ఆ మరుసటి రోజైన డిసెంబర్ 3 నాడు ఉద్ధవ్ థాకరే నేతృత్వంలో మహారాష్ట్ర కేబినెట్ విస్తరణ(Maharashtra cabinet expansion)కు మహూర్తం ఖరారైంది. అదే రోజున ఎన్సీపీ నేత అజిత్ పవార్ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నట్టు ఎన్సీపీ వర్గాలు తెలిపాయి. Read also : ఉద్ధవ్ థాకరేకు షాకిచ్చిన అజిత్ పవార్ అభిమానులు