Maharashtra CM: మహా ట్విస్ట్.. కొత్త సీఎం ఎవరంటే..?
Maharashtra CM: మహారాష్ట్రలో బీజేపీ నేతృత్వంలోని మహాయుతి అధికారంలోకి వచ్చినా.. ఇప్పటికీ ముఖ్యమంత్రి పీఠంపై పీఠముడి వీడలేదు. ఎన్నికల్లో ఎక్కువగా సీట్లు గెలిచిన భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రి పీఠం తమకే కావాలంటోంది. మరోవైపు కూటమి వెళ్లి గెలిచిన నేపథ్యంలో తమకే సీఎం ఇవ్వాలని శివసేన పట్టుపడుతోంది. మొత్తంగా మహా పంచాయితీ ప్రస్తుతం దేశ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిందనే చెప్పాలి.
Maharashtra CM: దేశ ఆర్ధిక రాజధాని మహారాష్ట్రలో బీజేపీ నేతృత్వంలోని మహాయుతి (ఎన్డీయే)కూటమి ప్రతిపక్ష మహా వికాస్ అఘాడీ కూటమిపై భారీ విజయం సాధించడంతో ఫుల్ జోష్ లో ఉంది. అయితే మహారాష్ట్ర శాసన సభ గడువు నేటితో ముగయనున్న నేపథ్యంలో నిన్న రాత్రి వరకు ముఖ్యమంత్రి పీఠంపై కూటమి పెద్దలు ఎలాంటి నిర్ణయం వెలుబడలేదు. అయితే.. కూటమిలో పెద్దన్న పాత్ర పోషించడంతో ఎక్కువ సీట్లు సాధించిన బీజేపీ తమకే న్యాయంగా ముఖ్యమంత్రి పీఠం దక్కాలంటోంది. మరోవైపు ఏక్ నాథ్ షిండే ముఖ్యమంత్రిగా కూటమి ఎన్నికల్లో విజయం సాధించిన నేపథ్యంలో తమ నాయకుడికే ముఖ్యమంత్రి పీఠం ఇవ్వాలని పట్టుబడుతోంది శివసేన. మరోవైపు కూటమిలోని అజిత్ పవార్ మాత్రం.. బీజేపీకే మద్దతు తెలుపుతున్నారు.
మరోవైపు శివసేన నాయకులు మాత్రం.. బిహార్ ఫార్మాలా ప్రకాం.. ఏక్ నాథ్ శిండేను ముఖ్యమంత్రిగా కంటిన్యూ చేయాలని డిమాండ్ చేస్తోంది. అయితే.. బీజేపీకి ఛాన్స్ వస్తే దేవేంద్ర ఫడణవీస్ కు ముఖ్యమంత్రి ఛాన్స్ ఇస్తారా.. ఎవరైనా కొత్త వ్యక్తికి సీఎం పదవి కట్టబెడతారా అనేది ఉత్కంఠగా మారింది. అయితే.. మహారాష్ట్ర ఎన్నికల్లో దేవేంద్ర ఫడణవీస్ ఒకవైపు తన పార్టీ బీజేపీ తరుపున.. మరోవైపు కూటమి తరుపున అన్నీ తానై వ్యవహరించారు. పైగా చదవుకున్న వ్యక్తి. పైగా మాస్ లీడర్ పార్టీ క్యాడర్ లో మంచి పట్టు ఉంది. ఇక సీఎం రేసులో అందరి కంటూ ముందున్నారు దేవేంద్ర ఫడణవీస్. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర నెక్ట్స్ సీఎం ఎవరనే దానిపై పార్టీ పెద్దలతో చర్చించేందుకు సోమవారం రాత్రి దేశ రాజధాని ఢిల్లికి వెళ్లారు.
బిహార్ ఫార్మాల ప్రకారం తక్కువ సీట్లు వచ్చిన జేడీయూకు చెందిన నితిష్ కుమార్ కు ముఖ్యమంత్రి పీఠం ఇచ్చినట్టే.. మహారాష్ట్రలో కూడా శివసేన అభ్యర్ధి ఏక్ నాథ్ షిండేను ముఖ్యమంత్రిగా కొనసాగించాలని చెబుతున్నారు. అయితే.. మహారాష్ట్రలో సీఎం గా శిండే ఉన్నా.. కీలక నిర్ణయాలు దేవేంద్ర ఫడణవీస్ ఆధ్వర్యంలోనే సాగాయనేది బహిరంగ రహస్యం. ఒక రకంగా ఫడణవీస్ శాడో సీఎంగా వ్యవహరించరనేది అందరు చెప్పుకుంటున్నారు. అంతేకాదు మహారాష్ట్రలో మహా వికాస్ అఘాడీ కూటమి విచ్ఛిన్నం చేయడంతో పాటు మహా అసెంబ్లీ ఎన్నికల్లో చావు దెబ్బ తీసే వ్యూహాలు రచించన నేతగా ఫడణవీస్ మంచి పేరు తెచ్చుకున్నారు. అయితే.. ముఖ్యమంత్రి నిర్ణయంపై మహాయుతిలో ఇప్పటి వరకు ఎలాంటి కీలక నిర్ణయం తీసుకోలేదని ఎన్సీపీ నేత డిప్యూటీ సీఎం అజిత్ పవార్ చెబుతున్నారు.
అయితే.. మహారాష్ట్రలో 14వ అసెంబ్లీ పదవి కాలం నేటితో ముగయనుంది. ఆ లోగా కొత్త ప్రభుత్వం ఏర్పాటు కాకపోతే.. రాష్ట్రపతి పాలన విధించాల్సి ఉంటుంది. ఈ వాదనలను అధికారులు ఖండించారు. అసలు మహారాష్ట్రలో అటువంటి పరిస్థితే ఉత్పన్నం కాదంటున్నారు. ఈ ఆదివారమే కొత్తగా మహారాష్ట్ర శాసనసభకు ఎన్నికైన సభ్యుల పేర్లతో ఓ గెజిట్ ను గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ ఎన్నికల కమిషన్ అధికారులకు అందజేశారు. దీంతో 15వ మహారాష్ట్ర అసెంబ్లీ అమల్లోకి వచ్చినట్లే అని చెబుతున్నారు అధికారులు. ప్రజా స్వామ్యంలో ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 73 ప్రకారం గవర్నర్ గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చినప్పటి నుంచి కొత్త శాసన సభ అమల్లోకి వచ్చినట్లేనని రాజ్యాంగ నిపుణులు చెబుతున్నారు.
ఇదీ చదవండి : Shraddha Kapoor: చిరంజీవికి శ్రద్ధా కపూర్ కు ఉన్న రిలేషన్ తెలుసా.. ఫ్యూజులు ఎగిరిపోవడం పక్కా..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebook, Twitter