Maharashtra CM: మహారాష్ట్ర సీఎం రేస్.. రేపే క్లారిటీ..
Maharashtra CM: మహారాష్ట్రలో ఎవరు ముఖ్యమంత్రి అయ్యే విషయంలో కేంద్ర పెద్దలు తేల్చి చెప్పేసారు. ఈ నెల 5న బీజేపీ నేత ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారనే క్లారిటీ ఇచ్చారు. దీంతో దేవేంద్ర ఫడణవీస్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం దాదాపు ఖాయమనే మాటలు వినిపిస్తున్నాయి. కానీ మధ్యలో ఫడణవీస్ కు జేపీ నడ్డా ప్లేస్ లో బీజేపీ జాతీయ అధ్యక్ష బాధ్యతలు అప్పగించి మరో వ్యక్తిని సీఎం చేస్తారనే ఊహాగానాలు మొదలయ్యాయి. దీనిపై రేపు క్లారిటీ రానుంది.
Maharashtra Chief Minister: నేడు మహారాష్ట్రలో బీజేపీ, శిశసేన షిండే, అజిత్ పవార్ ఎన్సీపీ నేతల కీలక సమావేశం జరుగనుంది. ఇందులో మహారాష్ట్ర సీఎం ఎవరన్న విషయంపై క్లారిటీ రానుంది. మహాయుతి నేతలు సమావేశంలో మహారాష్ట్రకు కాబోయే సీఎం దేవేంద్ర ఫడణవీసేనని తెలుస్తోంది. ఒకటి రెండు రోజుల్లో ఆయన అధికారికంగా ప్రకటించే అవకాశాలున్నాయని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు ఈ రోజు జరిగే మహాయుతి భేటిలో బీజేపీ మహారాష్ట్ర అగ్ర నేత దేవేంద్ర ఫడ్నవీస్, శివసేన అధ్యక్షుడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ శిండే, ఎన్సీపీ అధ్యక్షుడు అజిత్ పవార్ హాజరవుతారు. అంతేకాదు ఈ సమావేశంలో ఏయే పార్టీలకు ఎన్నిమంత్రిత్వ శాఖల కేటాయించనున్నారనే దానిపై ముగ్గురు నేతలు చర్చించనున్నట్టు సమావేశం.
ముఖ్యంగా హోం, పట్టణాభివృద్ధి, పీడబ్ల్యూడీ, ఆర్ధిక శాఖలతో పాటు అసెంబ్లీ స్పీకర్ పదవిపై మూడు పార్టీలు గట్టి పట్టుపడుతున్నాయి. ముఖ్యమంత్రి పీఠం తమకు రావడం లేదనే క్లారిటీ షిండే, అజిత్ పవార్ లకు క్లారిటీ రావడంతో ఈ సమావేశానికి ప్రాధాన్యత అదిరింది. హోం, స్పీకర్ పదవి విషయంలో బీజేపీ పట్టు వీడటం లేదు. ఈ కారణం వల్లే కొత్త ముఖ్యమంత్రి ప్రకటన లేట్ అవుతోందనేది బీజేపీ అంతర్గత సంభాషణల్లో వ్యక్తం అవుతోంది. ఈ సమావేశంలోగా దీనిపై అటో ఇటో తేల్చుకోవాలని, లేదంటే తామే నిర్ణయిస్తామని అమిత్ షా మహాయుతి కూటమి నేతలకు స్పష్టం చేసారట. దీంతో శాసనసభాపక్షను ఎన్నుకునేందుకు బీజేపీ ఎమ్మెల్యేలు సమావేశం కానున్నారు. దేవేంద్ర ఫడ్నవీస్‌ను బీజేపీ శాసనసభాపక్ష నేతగా ఎన్నుకుంటారని భారతీయ జనతా పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
మహారాష్ట్రలో కొత్తగా ఏర్పడే మహాయుతి (ఎన్టీయే) ప్రభుత్వంలో ఏక్‌నాథ్ శిందే తనయుడు శ్రీకాంత్ శిందే డిప్యూటీ సీఎం రేసులో ఉన్నారని వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు మహాయుతికి ఏక్ నాథ్ కన్వీనర్ గా ఉంటారనే ప్రతిపాదన వచ్చింది. కానీ దేశ వ్యాప్తంగా ఎన్డీయేకు ఎలాంటి కన్వీనర్ పోస్ట్ పదవి ఇవ్వలేదు. బీజేపీ కూడా ఇలాంటి పదవులు ఇవ్వకూడదనే నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. అయితే శ్రీకాంత్ శిందే ఉప ముఖ్యమంత్రి అవుతారనే ఊహాగానాలు మొదలయ్యాయి. శ్రీకాంత్ శిండే ప్రస్తుతం లోక్‌సభ ఎంపీగా ఉన్నారు. శ్రీకాంత్ శిండేను డిప్యూటీ సీఎంను చేస్తే ఏక్‌నాథ్ శిండే ఏ బాధ్యత తీసుకుంటారనేది ఉత్కంఠ రేపుతోంది.కానీ కేంద్ర పెద్దలు లోక్ సభ ఎంపీలతో రాజీనామా చేయించే ఉద్దేశ్యాలు కనిపించడం లేదు.
ఇలా వుండగా సొంతూరుకు వెళ్లిన శిండే తన మౌనాన్ని వీడారు. మహారాష్ట్ర కొత్త సీఎం విషయంలో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలదే ఫైనల్ డెసిషన్ అన్నారు. మహాయుతి కూటమిలో ఎలాంటి విభేదాలు లేవని శిండే క్లారిటీ ఇచ్చారు. నరేంద్ర మోడీ, అమిత్ షా లు చెప్పేదే తమకు వేదం అన్నారు షిండే. వాళ్ల నిర్ణయాలను తూచా తప్పకుండా పాటిస్తానన్నారు.
ఇదీ చదవండి: Mega Family: మెగా కుటుంబంలో ఆ ఫీట్ రిపీట్ అవుతుందా.. అపుడు చిరంజీవి.. ఇపుడు నాగబాబు..
ఇదీ చదవండి: Pushpa 2 the Rule First Review: ‘పుష్ప 2 ది రూల్’ మూవీ ఫస్ట్ రివ్యూ.. అల్లు అర్జున్ కుమ్మినట్టేనా..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.