Maharashtra: దమ్ము..ధైర్యముంటే ప్రభుత్వాన్ని పడగొట్టండి
దమ్ముంటే మా ప్రభుత్వాన్ని పడగొట్టండి అంటూ మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే సవాలు విసురుతున్నారు. బీజేపీపై విమర్శలు గుప్పించారు.
దమ్ముంటే మా ప్రభుత్వాన్ని పడగొట్టండి అంటూ మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే ( Maharashtra Cm Uddhav Thackeray ) సవాలు విసురుతున్నారు. బీజేపీపై విమర్శలు గుప్పించారు.
రాష్ట్రంలో కరోనా వైరస్ ( Coronavirus ) పరిస్థితుల కారణంగా ఆలయాలు తెరిచేందుకు అనుమతించలేదని తెలిసినా..కొందరు ఈ అంశాన్ని పట్టుకుని తన హిందూత్వాన్ని ప్రశ్నిస్తున్నారని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే మండిపడ్డారు. తన హిందూత్వ, బాలాసాహెబ్ హిందూత్వ వేరంటున్నారని చెప్పారు. అయితే గంటలు , పాత్రలు మోగించడమే మీ హిందూత్వమని..తన హిందూత్వం మాత్రం అలాంటిది కాదని స్పష్టం చేశారు.
మహారాష్ట్ర ( Maharashtra ) ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తయిందని చెప్పారు. సీఎం అయినప్పటి నుంచి ప్రభుత్వం పడిపోతుందంటూ కొందరు అదే పనిగా వ్యాఖ్యానిస్తూ వచ్చారని విమర్శించారు. ఎవరికైనా దమ్ము, ధైర్యముంటే ఇప్పుడు తమ ప్రభుత్వాన్ని పడగొట్టాల్సిందిగా సవాలు విసిరారు.
మరోవైపు శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ( Shiv sena mp sanjay raut ) కూడా కాస్త సంచలన వ్యాఖ్యలే చేశారు. మహారాష్ట్రలో 25 ఏళ్లపాటు పూర్తిగా అధికారంలో ఉంటామని..కేంద్రంలో కూడా అధికారంలో రావచ్చని సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్రలో అధికారంలో ఉన్న మహారాష్ట్ర వికాస్ అగాధి కూటమే కేంద్రంలో అధికారంలో వచ్చినా ఆశ్చర్యం లేదని చెప్పారు. Also read: Coronavirus: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ కు కరోనా