మహారాష్ట్రలో భారీగా తగ్గిన పెట్రోలు ధరలు
మహారాష్ట్రలో భారీగా తగ్గిన పెట్రోలు ధరలు
బీజేపి పరిపాలిత రాష్ట్రమైన మహారాష్ట్రలో పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా తగ్గాయి. మహారాష్ట్రలో ముంబై సహా అనేక నగరాల్లో పెట్రోల్ ధరలు రూ.90 దాటడంతో వాహనదారులు బెంబేలెత్తిపోతున్న సంగతి తెలిసిందే. అయితే, తాజాగా పెట్రోల్ ధరల్లో రూ.2.50 తగ్గిస్తున్నట్టు ప్రకటించిన కేంద్రం.. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అదే చొరవతో మరికొంత తగ్గిస్తే సామాన్యులపై భారం తగ్గుతుందని రాష్ట్రాలకు సూచించింది. కేంద్రం సూచన అనంతరం మహారాష్ట్రలోనూ పెట్రోల్‌పై లీటర్‌కి రూ.2.5 తగ్గిస్తున్నట్టు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ప్రకటించారు. మొత్తంగా మహారాష్ట్రలో లీటర్ పెట్రోల్ ధర రూ.5 తగ్గినట్టు ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తేల్చిచెప్పారు.
అలాగే పెట్రోల్‌తోపాటు డీజిల్ ధరలు సైతం తగ్గించే యోచనలో మహారాష్ట్ర సర్కార్ ఉందని ఈ సందర్భంగా దేవేంద్ర ఫడ్నవీస్ స్పష్టంచేశారు.