మహారాష్ట్ర: సర్కార్ ఏర్పాటుకు బీజేపికి గవర్నర్ ఆహ్వానం
మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటుకు బీజేపికి ఆ రాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కొశ్యారి ఆహ్వానం పలికారు. ఇటీవల జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అధిక సంఖ్యలో స్థానాలు గెల్చుకుని రాష్ట్రంలో అతిపెద్ద పార్టీగా అవతరించినందునే గవర్నర్ భగత్ సింగ్ బీజేపిని ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ఆహ్వానించారు. నవంబర్ 11వ తేదీలోగా మెజారిటీని నిరూపించుకోవాల్సిందిగా గవర్నర్ భగత్ సింగ్ యాక్టింగ్ చీఫ్ మినిస్టర్ దేవేంద్ర ఫడ్నవీస్ కి సూచించారు.
ముంబై: మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటుకు బీజేపికి ఆ రాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కొశ్యారి ఆహ్వానం పలికారు. ఇటీవల జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అధిక సంఖ్యలో స్థానాలు గెల్చుకుని రాష్ట్రంలో అతిపెద్ద పార్టీగా అవతరించినందునే గవర్నర్ భగత్ సింగ్ బీజేపిని ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ఆహ్వానించారు. నవంబర్ 11వ తేదీలోగా మెజారిటీని నిరూపించుకోవాల్సిందిగా గవర్నర్ భగత్ సింగ్ యాక్టింగ్ చీఫ్ మినిస్టర్ దేవేంద్ర ఫడ్నవీస్ కి సూచించారు.
మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు 145 మంది సభ్యుల బలం అవసరం కాగా బీజేపి 105 స్థానాలను మాత్రమే గెల్చుకుంది. మిత్రపక్షమైన శివసేన 56 స్థానాలు గెల్చుకుంది. అయితే, బీజేపికి తాము మద్దతు పలకాలంటే.. అధికారాన్ని కూడా 50-50 పద్దతిలో సగం సగం పంచుకోవాల్సిందేనని శివసేన షరతు విధించగా అందుకు బీజేపి ఆసక్తి కనబర్చడం లేదనే సంగతి తెలిసిందే. ఏదేమైనా తమ పార్టీ బలం నిరూపించుకోగలదని దేవేంద్ర ఫడ్నవీస్ ధీమా వ్యక్తంచేస్తున్న నేపథ్యంలో మహారాష్ట్ర రాజకీయాలు మరింత ఆసక్తికరంగా మారాయి.