ముంబై: మహారాష్ట్రలో బీజేపి, శివసేన, ఎన్సీపీలు ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు విఫలమైన నేపథ్యంలో రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాల్సిందిగా ఆ రాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కొశ్యారి రాష్ట్రపతిని కోరారు. ఈ మేరకు పూర్తి వివరాలను రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కి వివరిస్తూ ఓ నివేదికను పంపించారు. గత 15 రోజులుగా మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఒక్క పార్టీ కుడా సరైన మద్దతో ముందుకు రాలేదని గవర్నర్ భగత్ సింగ్ కొశ్యారి ఆ నివేదికలో పేర్కొన్నట్టు తెలుస్తోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also read : మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధిస్తారా ?


ఇదిలావుంటే, మహారాష్ట్ర గవర్నర్ రాష్ట్రపతి పాలన విధించాల్సిందిగా కోరుతూ లేఖ రాయడానికన్నా ముందుగానే.. గవర్నర్ కి ఓ లేఖ రాసిన ఎన్సీపీ.. ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు తమకు ఇంకొంత సమయం ఇవ్వాల్సిందిగా కోరినట్టు వార్తలొస్తున్నాయి. ఎన్సీపీ నేత అజిత్ పవార్ పేరిట గవర్నర్ కి లేఖ అందిందనేది ఆ వార్తల సారాంశంగా తెలుస్తోంది.