Corona New Variant In India: దేశంలో మరో కొత్త  కరోనా వేరియంట్(New Delta variant) వెలుగు చూసింది. ఇప్పుడిప్పుడే దేశం డెల్టా వేరియంట్(delta variant) నుంచి కోలుకుంటుంది. ఇటువంటి తరుణంలో మరో కొత్త రకం రావటం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా మధ్యప్రదేశ్​ ఇండోర్ లో ఏడుగురికి ఏవై.4 రకం(variant AY 4 2) కరోనా కొత్త వేరియంట్​ సోకినట్లు తేలింది. మహారాష్ట్ర(Maharashtra)లో 1 శాతం నమూనాలలో కొత్త డెల్టా ఏవై.4 వేరియంట్ కనుగొనబడింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

"దిల్లీకి చెందిన జాతీయ వ్యాధి నియంత్రణ కేంద్రం(NCDC) నుంచి వచ్చిన నివేదిక ప్రకారం.. ఏడుగురు వ్యక్తులకు ఏవై.4 రకం కరోనా వైరస్ సోకినట్లు తేలింది. వీరి నమూనాలను జన్యు పరీక్షల కోసం సెప్టెంబరులో దిల్లీకి పంపగా.. ఈ ఫలితాలు వెలువడ్డాయి."-బీఎస్ సైత్య, ముఖ్య వైద్యాధికారి.


Also Read: Zika Virus: ఉత్తరప్రదేశ్‌లో తొలి జికా వైరస్ కేసు.. ఐఏ‌ఎఫ్ ఆఫీసర్‌కు పాజిటివ్‌!


"కరోనా మహమ్మారి(Coronavirus) వ్యాప్తి మొదలైనప్పటి నుంచి దేశంలో ఏవై.4 రకం కేసులు(Corona New Variant In India) వెలుగు చూడటం ఇదే తొలిసారి. బాధితులంతా కొవిడ్​ టీకా(Covid Vaccine) రెండు డోసులను తీసుకున్నప్పటికీ వారికి ఈ రకం(Corona New Variant In India) వైరస్ సోకింది. చికిత్స తర్వాత వారంతా కోలుకున్నారు" అని బీఎస్​ సైత్య తెలిపారు.


ఏవై.4 రకం కరోనా వేరియంట్​ కొత్తదని ఇండోర్(Indore)​లోని మైక్రోబయాలజీ విభాగానికి చెందిన అధికారి డాక్టర్ అనితా మూతా పేర్కొన్నారు. దీని తీవ్రతపై సమాచారం ఎక్కువగా లేదని చెప్పారు. మరోవైపు.. మధ్యప్రదేశ్(Madhya pradesh)​లో ఇప్పటివరకు 1,53,202 మందికి కరోనా సోకినట్లు తేలింది. వైరస్ ధాటికి 1,391 మంది ప్రాణాలు కోల్పోయారు.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook