Zika virus in UP: దేశంలో కరోనా కేసులు ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతున్నాయి. అయితే మరోవైపు జికా వైరస్ దేశంలో మెల్లగా విస్తరిస్తోంది. ఉత్తరప్రదేశ్(Uttar Pradesh)లో తొలి జికా వైరస్ కేసు బయటపడింది. కాన్పూర్(Kanpur)లోని పోఖాపూర్ ప్రాంతంలో నివసిస్తున్న ఎయిర్ ఫోర్స్ (IAF)సిబ్బంది ఒకరికి ఈ వైరస్ సోకినట్టు అధికారులు తెలిపారు.
పేషెంట్స్ శాంపుల్స్ పరీక్షల కోసం పుణె పంపగా.. నివేదకలో పాజిటివ్ అని తేలిందని, దీంతో ఆ ప్రాంతాన్ని మున్సిపల్ కార్పొరేషన్ శానిటైజ్ చేసిందని చెప్పారు. పేషెంట్‌తో సన్నిహత సంబంధాలున్న 200 మందిని ఐసొలేషన్‌లో ఉంచి పరీక్షలు నిర్వహిస్తున్నట్టు కాన్పూర్ చీఫ్ మెడికల్ అధికారి నేపాల్ సింగ్(Nepal Singh) తెలిపారు. ఈ నేపథ్యంలో.. ఆరోగ్య శాఖతోపాటు స్థానిక సంస్థల అధికారులను అప్రమత్తం చేశారు. జికా వైరస్ వ్యాప్తి (zika virus in india) చెందకుండా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు.
ఉగాండాలో తొలిసారి గుర్తింపు..
దేశంలో ఉత్తరప్రదేశ్ కంటే ముందు కేరళ, మహారాష్ట్రలో జికా వైరస్ కేసులు(Zika Virus Cases in india) వెలుగులోకి వచ్చాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జికా వైరస్ ఏడిస్ దోమల ద్వారా వ్యాపిస్తుంది. జికా వైరస్‌ను 1947లో కోతుల్లో మొదటిసారి గుర్తించారు. 1952లో ఉగాండా(Uganda)లో మనుషుల్లో గుర్తించారు. ఉగాండాలోని 'జికా' అనే అడవి పేరు ఈ వైరస్‌కు పెట్టారు.
Also Read: Mann ki Baat: ఆ కాలం చెల్లింది..మహిళలే ఇక కీలకమంటున్న ప్రధాని మోదీ
జికా వైరస్ లక్షణాలు:
జికా వైరస్ సోకిన వారికి జ్వరం, దద్దుర్లు, తలనొప్పి, కండరాల నొప్పి, నీరసం లాంటి లక్షణాలు కనిస్తాయి. 2-7 రోజుల పాటు ఇవి కొనసాగితే, నిర్లక్ష్యం చేయకుండా వైద్యుడిని సంప్రదించాలి. అయితే.. ఈ వైరస్ ప్రాణాంతకం కాకపోయినప్పటికీ.. ఇప్పటి వరకూ దీనికి మందు లేకపోవడం అంతటా ఆందోళన కలిగిస్తోంది. సెక్యువల్ ఇంటర్‌కోర్స్ ద్వారా కూడా వ్యాధి వ్యాపించవచ్చు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook