Maharashtra Fire Accident: మహారాష్ట్రలోని ఓ ఫార్మా కంపెనీలో భారీ పేలుడు సంభవించింది. పెద్దఎత్తున అలముకున్న మంటల్లో సిబ్బందికి చిక్కుకుపోయారు. ఇప్పటి వరకూ ఏడుగురు మృతి చెందగా మరి కొంతమంది ఆచూకీ తెలియలేదు. ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మహారాష్ట్రలోని రాయ్‌గఢ్ జిల్లా మహద్ ఎంఐడీసీలో ఉన్న బ్లూ జెట్ హెల్త్ కేర్ ఫార్మా స్యూటికల్ కంపెనీలో జరిగిన ప్రమాదమిది. ఫ్యాక్టరీలో పేలుడు కారణంగా మంటలు అలముకున్నాయి. పనివేళలు కావడంతో సిబ్బంది చాలామంది మంటల్లో చిక్కుకున్నారు. కొందరు ప్రాణాలతో బయటకు పరుగులు తీశారు. అగ్ని ప్రమాదం సమాచారం అందగానే అగ్నిమాపక దళాలు, పోలీసులు, రెవిన్యూ సిబ్బంది చేరుకున్నారు. ఓ వైపు మంటల్ని అదుపులో తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తూనే మరోవైపు సహాయక చర్యలు ప్రారంభించారు. మంటలు భారీగా ఉండటంతో సహాయక చర్యలకు ఇబ్బంది ఏర్పడుతోంది. ఇప్పటి వరకూ ఏడుగురి మృతదేహాల్ని బయటకు తీశారు. మరో ఐదుగురి ఆచూకీ తెలియాల్సి ఉంది. ఏడుమందికి తీవ్ర గాయాలవడంతో ఆసుపత్రికి తరలించారు. 


షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం జరిగినట్టు ప్రాధమికంగా అంచనా వేస్తున్నారు. కెమికల్స్ ఉన్న బ్యారెల్స్ వైపుకు మంటలు వ్యాపించడంతో ప్రమాద తీవ్రత పెరిగినట్టు తెలుస్తోంది. పేలుడు జరిగిన ప్రదేశంలో కనీసం 11-12 మంది పనిచేస్తున్నట్టు తెలుస్తోంది. మంటలు ఉవ్వెత్తున ఎగసిపడటంతో సహాయక చర్యలు కష్టమయ్యాయి. కేమికల్స్, పేలుడు పదార్ధాలు ఉండటం వల్ల ప్రమాద తీవ్రత పెరిగినట్టు తెలుస్తోంది. ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభమైంది. 


Also read: Taj Mahal: తాజ్ మహల్ పై ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook