Maharashtra Results: వెంకటేశ్వరా నీవే దిక్కు.. ఫలితాల భయంతో తిరుమలకు క్యూ కట్టిన మహారాష్ట్ర మంత్రులు
Election Results: Maharashtra Ministers Que To Tirumala Visit: ఓటర్లు ఎటు వైపు నిలబడ్డారో.. మళ్లీ పట్టం కడుతారో లేదననే భయంతో మహారాష్ట్రకు చెందిన కొందరు మంత్రులు తిరుమలకు క్యూ కట్టారు. ఓటమి భయంతో శ్రీవారిని దర్శించుకున్నారు.
Tirumala Temple: కొన్ని గంటల్లో రాజకీయ భవిష్యత్ ఏమిటో తెలియనుంది. మళ్లీ అధికారంలోకి ఉంటామా.. లేదా ప్రతిపక్షంలో కూర్చుంటామా అనే భవితవ్యం తేలబోతున్న నేపథ్యంలో కొందరు నాయకులు ఫలితాలపై భయాందోళనలో ఉన్నారు. ఏం జరుగుతుందోనని ఉత్కంఠ ఏర్పడిన నేపథ్యంలో వారంతా దేవుడిని నమ్ముకున్నారు. 'దేవుడా నీవే దిక్కు' అంటూ ఆలయాల బాట పట్టారు. ఒకేరోజు నలుగురు మహారాష్ట్ర మంత్రులు తిరుమలను సందర్శించారంటే ఫలితాలపై ఎంత భయపడుతున్నారో అర్థమవుతోంది.
ఇది చదవండి: Adani Bribe: పురందేశ్వరి సంచలన ట్వీట్.. అదానీతో వైఎస్ జగన్ లంచం తీసుకున్నాడు
ఆంధ్రప్రదేశ్‌లోని తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని శుక్రవారం పలువురు ప్రముఖులు దర్శనం చేసుకున్నారు. మహారాష్ట్ర మంత్రులు ఉదయ్ సమంత్, సుధీర్ మునిగంటి వార్, రాధాకృష్ణ ఈ.వికేపాటి, సంబాజి పాటిల్ తిరుమలకు చేరుకున్నారు. స్వామివారిని ప్రత్యేక దర్శనం చేసుకున్న అనంతరం మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం రంగనాయకమండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేసి మంత్రులకు పట్టు వస్త్రంతో సత్కరించారు. ఈ సందర్భంగా స్వామి వారి తీర్థప్రసాదాలు అందించారు. తెలంగాణ ఎమ్మెల్సీ రఘోత్తం రెడ్డి వేరుగా దర్శించుకున్నారు.
Also Read: Sharmila: బిడ్డల మీద ప్రమాణం చేసి చెబుతున్నా.. ప్రభాస్ తో నాకు ఎటువంటి సంబంధం లేదు.. షర్మిల
రేపు మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు వెలువుడుతుండడంతోనే మంత్రులు శ్రీవారి దర్శనానికి వచ్చారని తెలుస్తోంది. ఒకేరోజు ముగ్గురు మంత్రులు రావడం చర్చనీయాంశంగా మారింది. మహారాష్ట్ర ఎన్నికల్లో మహాయుతి కూటమికి ప్రజలకు కొంత వ్యతిరేకత ఉన్నారని సమచారం. ఏక్‌నాథ్ షిండే నడిపిన రాజకీయం ప్రజల్లో అసహనం వ్యక్తమైందని తెలుస్తోంది. ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం.. రైతుల సమస్యలు పరిష్కరించకపోవడంతో ప్రస్తుత అధికార కూటమికి కొంత ప్రతికూల వాతావరణం ఉన్నట్లు చర్చ జరుగుతోంది. మహిళలు, రైతులు వ్యతిరేక ఓటు వేశారని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ సందర్భంగా ఓటమి భయంతో ఆ మంత్రులు దేవుడిని కోరుకునేందుకు వచ్చినట్లు చర్చ జరుగుతోంది. ఒకే రోజు ముగ్గురు మంత్రులు దర్శనం చేసుకోవడం మహారాష్ట్రలో కూడా ఆసక్తికర చర్చ జరుగుతోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebook, Twitter