Maharashtra Political Latest Updates: మహారాష్ట్ర రాజకీయాల్లో మరో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఆదివారం తిరుగుబాటు చేసి 42 మంది ఎమ్మెల్యేలతో అధికారపక్షానికి మద్దతు తెలిపిన అజిత్ పవార్‌కు ఇద్దరు ఎమ్మెల్యేలు షాకిచ్చారు. ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు మళ్లీ శరద్ పవార్ వద్దకు చేరుకున్నారు. తమకు తెలియకుండా సంతకాలు తీసుకున్నారని వారు తెలిపారు. అజిత్ పవార్ ఎత్తుగడతో తాము ఏకీభవించడం లేదని స్పష్టం చేశారు.  అజిత్ ప్రమాణ స్వీకారానికి హాజరైన ఎమ్మెల్యేలు దిలీప్ మోహితే పాటిల్, మకరంద్ పాటిల్.. సోమవారం శరద్ పవార్‌తో కనిపించారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అజిత్ పవార్ నుంచి ఎమ్మెల్యేలు యూ టర్న్ తీసుకోవడంపై మహారాష్ట్ర ఎన్‌సీపీ అధ్యక్షుడు జయంత్ పాటిల్ స్పందించారు. మిగిలిన వారు కూడా తిరిగి వస్తారని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. తిరుగుబాటు చేసిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. పార్టీ గుర్తును ఎవరూ ఉపయోగించకూడదని.. అనుమతి లేకుండా ఉపయోగిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 


పార్టీ నుంచి ఎమ్మెల్యే వెళ్లినా.. ప్రజలు తనతో ఉన్నారని ఎన్‌సీపీ అధినేత శరద్ పవార్ తెలిపారు. ఈ క్రమంలో ఆయర రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించనున్నారు. సతారా జిల్లాలోని కారాడ్‌లో పర్యటించి.. భారీగా తరలి వచ్చిన కార్యకర్తలు, నాయకులను ఉద్దేశించి ఉద్వేగభరితంగా  ప్రసంగించారు. బీజేపీ తీరుపై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. పార్టీని మళ్లీ పునర్నిర్మిస్తానని.. ఎవరూ అధైర్య పడొద్దని కార్యకర్తలకు భరోసా ఇచ్చారు. నేటి నుంచే తన పోరాటం నుంచే మొదలవుతుందని.. పార్టీని ముక్కలు చేయడానికి ప్రయత్నించిన వారి వారి స్థానం ఏంటో చూపిస్తానని అన్నారు. 


పార్టీలను ముక్కలు చేసేందుకు కొందరు ఇతరులు విసిరే వలలో పడతారని అజిత్ పవర్‌ను ఉద్దేశించి శరద్ పవార్ కామెంట్స్ చేశారు. ఇలాంటి అసమ్మతి వస్తునే ఉంటుందని.. మళ్లీ పునర్నిర్మించడం పార్టీ అధ్యక్షుడిగా తన బాధ్యత అనిన్నారు. మరోవైపు అజిత్‌ పవార్‌తోపాటు మంత్రులుగా ప్రమాణం స్వీకారం చేసిన 9 ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని స్పీకర్‌ రాహుల్‌ నర్వేకర్‌ను ఎన్‌సీపీ నాయకులు కోరారు.
అధికార పక్షంలో చేరిన అజిత్ పవార్‌ డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయగా.. ఛగన్ భుజ్‌బల్, దిలీప్ వాల్సే పాటిల్, హసన్ ముష్రిఫ్, ధనంజయ్ ముండే, ధర్మారావు ఆత్రమ్, ఆదిత్య తత్కరే, సంజయ్ బాబురావు బన్సోడే, అనిల్ పాటిల్‌లకు మంత్రి పదవులు దక్కిన విషయం తెలిసిందే.


Also Read: Jonny Bairstow Controversial Run Out: ఊహించని రీతిలో బెయిర్‌ స్టో రనౌట్.. ఫస్ట్ టైమ్ ఇలా..  


Also Read: Telangana Politics: అవినీతికి కాంగ్రెస్ రారాజు.. అందుకే రాహుల్ గాంధీ ఓడిపోయారు: మంత్రులు ఫైర్   


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి