Omicron in Maharashtra: దేశంలో కరోనా ఒమిక్రాన్ వేరియంట్ ఆందోళనలు​ రోజు రోజుకు (Omicron Scare in India) తీవ్రమవుతున్నాయి. మహారాష్ట్రలో ఒమిక్రాన్ కేసులు అంతకంతకూ పెరుగుతూ (Omicron fears in Maharashtra) పోతున్నాయి. చాలా మందికి లక్షణాలు లేకున్నా పాజిటివ్​గా తేలడంతో ఆందోళనలు మరింత పెరుగుతున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తాజాగా మహారాష్ట్రలో ఒక్క రోజులోనే (శుక్రవారం) 20 ఒమిక్రాన్ కేసులు నిర్ధారణ అయినట్లు అధికారులు (Omicron cases in Maharashtra) వెల్లడించారు. దీనితో మహారాష్ట్ర వ్యాప్తంగా మొత్తం ఒమిక్రాన్ వేరియంట్ కేసుల సంఖ్య 108 కి చేరింది.


ఇందులో ఇప్పటికే 54 మంది కోలుకుని.. ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్​ అయినట్లు ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు.


కొత్త కేసులు వచ్చింది ఎక్కడెక్కడంటే..


కొత్తగా నమోదైన 20 ఒమిక్రాన్ కేసుల్లో 11 ముంబయిలో (Omicron cases in Mumbai) గుర్తించగా.. 6 కేసులు పుణేలో బయటపడ్డాయి. సతారాలో రెండు, అహ్మద్​నగర్​లో ఒక కేసు చొప్పున గుర్తించినట్లునట్లు అధికారులు తెలిపారు.


ఇక ఇప్పటి వరకు ముంబయిలో 46 ఒమిక్రాన్ కేసులు బయటపడ్డాయి. పుణే (Omicron cases in Pune) సిటీలో 7 కేసులు, పుణే గ్రామీణ ప్రాంతంలో 15 కేసులు నమోదయ్యాయి.


కొత్త కేసుల్లో మొత్తం 15 మంది అంతర్జాతీయ ప్రయాణాలు చేసినట్లు చెప్పారు అధికారులు. ఓ వ్యక్తి దేశీయంగా ఇతర పట్టణాలకు ప్రయాణించి వచ్చినట్లు పేర్కొన్నారు. అయితే ఎక్కువ మందికి ఎలాంటి లక్షణాలు లేవని తెలిపారు అధికారులు.


ఇందులో ఒకరు మైనర్​ కాగా.. ఆరు మంది 60 ఏళ్లకు పైబడిన వాళ్లని మహారాష్ట్ర ఆరోగ్య విభాగం తెలిపింది. 20 కేసుల్లో 12 మంది రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నవారు ఉన్నట్లు వివరించింది. ఏడుగురు టీకా తీసుకోలేదని వెల్లడించింది. ఒకరు టీకా తీసుకునేందుకు అర్హులు కాదని తెలిపింది.


డిసెంబర్ 1 నుంచి ఇప్పటి వరకు 1,63,553 మంది అంతర్జాతీయ ప్రయాణికులు ముంబయికి వచ్చారు. అందులో 23,933 మంది రిస్క్ అధికంగా ఉన్న దేశాల నుంచి రావడం గమనార్హం.


Also read: Delhi Omicron cases : ఢిల్లీలో కోవిడ్ కేసుల విజృంభన, సరోజినీ నగర్ మార్కెట్‌పై ఆంక్షలు..


Also read: Railway New Changes: భారతీయ రైల్వే కొత్త నియమాలు, జనవరి 1 నుంచి తిరిగి జనరల్ కోచ్ ప్రయాణాలు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook