Delhi Omicron cases : ఢిల్లీలో కోవిడ్ కేసుల విజృంభన, సరోజినీ నగర్ మార్కెట్‌పై ఆంక్షలు..

Delhi Sarojini Nagar Market to follow odd-even operations : ఢిల్లీలో అకస్మాత్తుగా కోవిడ్ కేసులు పెరగడానికి ఒమిక్రాన్ వేరియంట్ కారణమని వైద్యాధికారులు చెప్తున్నారు. దక్షిణ ఢిల్లీలోని సరోజినీ నగర్ మార్కెట్‌లోని షాపులు బేసి - సరి విధానాన్ని అనుసరించాలని కేజ్రీవాల్ ప్రభుత్వం ఆదేశించింది.

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 25, 2021, 02:08 PM IST
  • ఢిల్లీలో పెరిగిపోతున్న కోవిడ్‌, ఒమిక్రాన్‌ కేసులు
  • గత ఆరు నెలలతో పోల్చుకుంటే దేశ రాజధాని ప్రస్తుతం కోవిడ్‌ కేసులు అత్యధికం
  • ఢిల్లీలో బేసి-సరి విధానం అమలు
  • సరోజినీ నగర్ మార్కెట్‌లోని షాపుల వ్యాపారులకు ఆదేశాలు
Delhi Omicron cases : ఢిల్లీలో కోవిడ్ కేసుల విజృంభన, సరోజినీ నగర్ మార్కెట్‌పై ఆంక్షలు..

Delhi reports 180 new Omicron cases in 24 hours Sarojini Nagar market to operate on odd-even basis on Dec 25, 26 : దేశంలో కోవిడ్‌ కొత్త వేరియంట్ రోజురోజుకు ఒమిక్రాన్‌ విజృంభిస్తూనే ఉంది. ఇప్పటికే 17 రాష్ట్రాలకు ఒమిక్రాన్‌ పాకింది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో కోవిడ్‌ కేసులు, ఒమిక్రాన్‌ కేసులు పెరిగిపోతున్నాయి. ఢిల్లీలో శుక్రవారం కొత్తగా 180 కోవిడ్‌ కేసులు (Covid‌ cases) నమోదయ్యాయి. మొత్తం యాక్టివ్ కేసులు (Active cases) 782కి చేరుకున్నాయి. ఈ మేరకు ఆరోగ్య మంత్రిత్వ శాఖ వివరాలను వెల్లడించింది. అయితే గత ఆరు నెలల్లో పోల్చుకుంటే ప్రస్తుతం కోవిడ్‌ కేసులు అత్యధికం ఉన్నాయి. ఢిల్లీలో (Delhi) ఇప్పటికే మరో 67 ఒమిక్రాన్ కేసులు (Omicron cases) నమోదయ్యాయి. 

చాలా కాలంగా కోవిడ్‌కు సంబంధించి ఢిల్లీలో ఎలాంటి మరణాలు లేవు. అయితే ఢిల్లీలో డిసెంబర్‌లో ఇప్పటి వరకు ఐదు మరణాలు నమోదయ్యాయి. ఢిల్లీలో అకస్మాత్తుగా కోవిడ్ కేసులు పెరగడానికి ఒమిక్రాన్ వేరియంట్ కారణమని వైద్యాధికారులు చెప్తున్నారు. ఢిల్లీలో కోవిడ్-19 కేసులు క్రమంగా పెరుగుతూ ఉన్నాయి. శుక్రవారం 180 కేసులు వెలుగులోకి రాగా.. గురువారం 24 గంటల్లో 125 కేసులు, మంగళవారం 91 కేసులు నమోదు అయ్యాయి. ఇక శనివారం మరో 69 కోవిడ్ కేసులు నమోదయ్యాయి.

ఢిల్లీలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కోవిడ్‌‌‌‌-19 కేసుల సంఖ్య 14,42,813. 14.16 లక్షల మంది రోగులు కోవిడ్‌ నుంచి కోలుకున్నారు. ఇక నిన్న మొత్తం 62,697 టెస్ట్‌లు నిర్వహించారు. 57,583 RT-PCR, 5,114 ర్యాపిడ్ యాంటిజెన్ టెస్ట్‌లను నిర్వహించారు.

ఢిల్లీలో క్రమంగా కోవిడ్‌‌‌-19 కేసులు (Covid‌‌‌-19 cases) పెరగడం వల్ల దక్షిణ ఢిల్లీలోని సరోజినీ నగర్ మార్కెట్‌లోని (Sarojini Nagar market ) షాపులు బేసి - సరి విధానాన్ని అనుసరించాలని కేజ్రీవాల్ ప్రభుత్వం (Kejriwal government) ఆదేశించింది. డిసెంబర్ 25‌‌-26 తేదీల్లో వీకెండ్‌ టైమ్‌లో ఈ బేసి - సరి విధానాన్ని (odd-even basis) అనుసరించాలని ఢిల్లీ ప్రభుత్వం (Delhi Government) సూచించింది. సరోజినీ నగర్ మార్కెట్‌లో రద్దీ దృష్టా ఢిల్లీ హైకోర్టు ఈ ఉత్తర్వులు జారీ చేసింది. సరోజినీ నగర్ మార్కెట్‌లో అంత పెద్ద ఎత్తున జనసందోహం ఉంటే ఎలా అని ఆందోళన వ్యక్తం చేసింది ఢిల్లీ హైకోర్టు. 

Also Read : Flipkart Offers: ఫ్లిప్​కార్ట్​లో రూ.20,990 స్మార్ట్​ ఫోన్​.. కేవలం రూ.1,165కే..!

ఇక దేశంలో ఒమిక్రాన్ కేసుల విషయానికి వస్తే.. మహారాష్ట్ర, ఢిల్లీలో అధికంగా కేసులు నమోదు అయ్యాయి. అలాగే తెలంగాణలో 38, తమిళనాడులో 34, కర్ణాటకలో 31, గుజరాత్‌లో 30, కేరళలో 27, రాజస్థాన్‌లో 22 కొత్త స్ట్రెయిన్ కేసులు నమోదయ్యాయి. దేశంలో ఒమిక్రాన్ (Omicron) కేస్‌లోడ్ సరిగ్గా ఒక వారం క్రితం 100 మార్క్‌లో ఉంటే.. మంగళవారానికి అంది 200కు చేరింది. శనివారం నాటికి ఈ సంఖ్య 350 మార్క్‌ను దాటింది.

Also Read : Bank Holidays January 2022: జనవరిలో మొత్తం 16 బ్యాంక్ హాలిడేస్​- పూర్తి వివరాలివే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

 

Trending News