Corona in India: మహారాష్ట్రలో కరోనా తీవ్ర రూపం- ఒక్క ముంబయిలోనే 20 వేలకుపైగా కేసులు
Corona in India: దేశవ్యాప్తంగా కరోనా కేసులు భారీ సంఖ్యలో పెరుగుతున్నాయి. మహారాష్ట్రలో ఒక్క రోజులోనే 36 వేలకుపైగా పాజిటివ్ కేసులు (Corona cases in Maharashtra) బయటపడ్డాయి.
Corona in India: దేశంలో కరోనా మరోసారి తీవ్ర రూపం (Corona cases in India) దాల్చుతోంది. మహారాష్ట్రలో కొవిడ్ ప్రభావం తీవ్రంగా ఉంది.
మహారాష్ట్రలో తాజాగా 36,265 కరోనా కేసులు (Corona cases in Maharashtra) నమోదయ్యాయి. 13 మంది కొవిడ్‌తో మృతి చెందారు. 8,907 మంది కరోనా నుంచి కోలుకున్నారు.
రాష్ట్రంలో మొత్తం 1,14,847 యాక్టివ్ కరోనా (Active Corona cases in Maharashtra) కేసులు ఉన్నాయని ఆరోగ్య శాఖ వెల్లడించింది.
ఇక రాష్ట్రంలో కొత్తగా 79 ఒమిక్రాన్ వేరియంట్ (Omicron cases in Maharashtra) కేసులు నమోదయ్యాయి. దీనితో రాష్ట్రవ్యాప్తంగా ఒమిక్రాన్ కేసుల సంఖ్య 876కు పెరిగింది. ఇందులో 381 మంది ఇప్పటికే కోలుకున్నారు.
ముంబయిలో కొవిడ్ కల్లోలం..
ఒక్క ముంబయిలోనే గురువారం 20,181 కరోనా కేసులు (Corona cases in Mumbai) నమోదయ్యాయి. 67 వేల శాంపిళ్లను టెస్ట్ చేయగా ఈ కేసులు వెలుగు చూశాయి. కొవిడ్ కారణంగా నలుగురు మరణించారు.
ముంబయిలో యాక్టివ్ కేసులు (Corona active cases in Mumbai) 79,260 వద్దకు పెరిగాయి. నేటితో నగరంలో పాజిటివిటి రేటు 29.90 శాతానికి పెరిగింది. తాజాగా 2,837 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. ముంబయిలో రికవరీ రేటు 88 శాతంగా ఉంది.
ఇతర రాష్ట్రాల్లో ఇలా..
తమిళనాడులో కొత్తగా 6,983 మందికి కరోనా పాజిటివ్‌గా (Corona cases in Tamil Nadu) తేలింది. 721 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. 11 మంది కరోనాతో మృతి చెందారు. రాష్ట్రంలో మొత్తం యాక్టివ్ కేసులు (Corona Active cases in Tamil Nadu) 22,828 వద్ద ఉన్నాయి.
గుజరాత్లో కొత్తగా 4,213 పాజిటివ్ (Corona cases in Gujarath) కేసులు నమోదయ్యాయి. 860 మంది రికవరీ అయ్యారు. రాష్ట్రంలో 14 వేల యాక్టివ్ కేసులు ఉన్నాయి.
కర్ణాటకలో 5,031 కొవిడ్ కేసులు (Corona cases in Karnataka) నమోదవగా.. గడిచిన 24 గంటల్లో ఒకరు మృతి చెందారు. ఒక్క బెంగళూరులోనే 4,324 కొవిడ్ కేసులు నమోదవడం గమనార్హం. రాష్ట్రంలో పాజిటివిటి రేటు 3.95 శాతంగా ఉంది.
కేరళలో కొత్తగా 4,649 కొవిడ్ కేసులు (Corona cases in Kerala) నమోదయ్యాయి. 17 మంది కరోనాతో మృతి చెందారు. దీనితో కేరళలో కొవిడ్‌తో మృతి చెందిన వారి సంఖ్య 49,116కు పెరిగింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 25,157 యాక్టివ్ కరోనా కేసులు ఉన్నాయి.
Also read: Ashok Gehlot tested Covid Positive: రాజస్థాన్ సీఎం అశోక్ గహ్లోత్‌కు కరోనా పాజిటివ్
Also read: Omicron scare: కేరళలో ఒమిక్రాన్ విజృంభణ- కొత్తగా 50 మందికి పాజిటివ్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook