బుల్‌దాణ: మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అమరావతి డివిజన్‌లోని బుల్‌దాణా జిల్లాలో వేగంగా వెళ్తున్న ఓ ట్రక్కు టైర్ పేలడంతో ఎదురుగా వస్తోన్న మహింద్రా మాక్సీ టెంపోపైకి అంతేవేగంగా దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో టెంపోలో ప్రయాణిస్తున్న 13 మంది మృతిచెందగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. టెంపోలో ప్రయాణిస్తున్న వాళ్లు బుల్‌దాణ జిల్లాలోని మల్కాపూర్ నుంచి కర్ణాటకలోని అనురాబాద్‌కి వెళ్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ట్రక్కులో 16 మంది ప్రయాణిస్తుండగా వారిలో 13 మంది మృత్యువాతపడినట్టు తెలుస్తోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

[[{"fid":"178462","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


ట్రక్కు బలంగా ఢీకొన్న వేగానికి టెంపో పూర్తిగా ట్రక్కు కింద నుజ్జునుజ్జయిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని జేసీబీ సహాయంతో ట్రక్కు, టెంపో వాహనాలను వేరు చేసి అతికష్టమ్మీద మృతదేహాలను వెలికితీశారు. మృతుల్లో ఆరుగురు ఒకే కుటుంబానికి చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. ప్రమాదం తీవ్రతకు అప్పటికే పలు మృతదేహాలు నుజ్జునుజ్జయ్యాయి. ట్రక్కు డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.