Anand Mahindra: సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే మహీంద్ర గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్ర మరోసారి వార్తల్లో నిలిచారు. ఆసక్తికరమైన వ్యాఖ్యలతో ఆసక్తి రేపారు. ఆ ట్వీట్ ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మహీంద్ర గ్రూప్(Mahindra group) ఛైర్మన్ ఆనంద్ మహీంద్ర గురించి ఇటీవలి కాలంలో అందరికీ తెలుసు. సోషల్ మీడియాలో ఎల్లప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ నెటిజన్లకు ఆసక్తికరమైన విషయాల్ని షేర్ చేస్తుంటారు. ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలతో చర్చనీయాంశమవుతుంటారు. ఇప్పుడు మరోసారి తన ట్వీట్‌తో చర్చనీయాంశమయ్యారు. ఆయన చేసిన ట్వీట్ ఇప్పుడు అందరినీ ఆలోచింపజేస్తోందనడంలో ఏ మాత్రం సందేహం లేదు. 


ఆనంద్ మహీంద్రకు టైమ్ మిషన్ (Time Machine). అదే ఆయన కోరిక. ఎందుకో తెలుసా.1903 నాటి ముంబైలోని తాజ్ హోటల్ ఫోటోను షేర్ చేశారు. ఆ సమయంలో తాజ్ హోటల్‌(Taj Hotel)లో ఒకరోజు బస చేయడానికయ్యే ఖర్చు 6 రూపాయలట. తాజ్ హోటల్ ఓపెనింగ్ బ్రోచర్‌ను విడుదల చేస్తూ ట్వీట్ చేశారు. దేశవ్యాప్తంగా నెలకొన్న ద్రవ్యోల్బణ పరిస్థితుల్ని అధిగమించేందుకు వెంటనే ఓ టైమ్ మిషన్ ఉంటే..నాటి రోజులకు వెళ్లి రావచ్చనేది ఆనంద్ మహీంద్ర ఆలోచన. ఎందుకంటే ఇప్పుడదే తాజ్ హోటల్‌లో ఒకరోజు బస చేయాలంటే 15 నుంచి 18 వేలవుతుంది. అదే నాటి రోజులకు వెళ్లొస్తే..కేవలం 6 రూపాయలు మాత్రమే ఖర్చవుతుంది. అదే ఆనంద్ మహీంద్ర(Anand Mahindra) వినూత్న ఆలోచన. టైమ్ మిషన్ ఉంటే భూతకాలానికి వెళ్లి వస్తారట.


Also read: జాన్సన్ అండ్ జాన్సన్ సింగిల్ షాట్ వ్యాక్సిన్‌కు ఇండియాలో అనుమతి


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook