UP: ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు సజీవదహనం
ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా (Agra) జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు సజీవ దహనమయ్యారు.
Road Accident in Uttar Pradesh: న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా (Agra) జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు సజీవ దహనమయ్యారు. ఆగ్రా-లక్నో ఎక్స్‌ప్రెస్ వేపై ఖండౌలి పోలీస్‌స్టేషన్ పరిధిలో తెల్లవారు జామున 5 గంటల ప్రాంతంలో ఈ దారుణ ఘటన జరిగింది. ఎక్స్‌ప్రెస్ వేపై తెల్లవారుజామున యూపీ (Uttar Pradesh) నుంచి ఢిల్లీ వైపు వెళ్తున్న కారును.. రాంగ్ రూట్‌లో వస్తున్న ట్యాంకర్ ఢికొట్టింది. దీంతో కారులో మంటలు చెలరేగి దానిలో ప్రయాణిస్తున్న ఐదుగురు సజీవ దహనమయ్యారు.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు సంఘటనా (Road Accident) స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. అగ్నిమాపక సిబ్బంది వచ్చే సమయానికే కారులో ప్రయాణిస్తున్న వారంతా కాలి బూడిదయ్యారు. ప్రమాదానికి కారణమైన కంటైనర్ నాగాలాండ్ నుంచి వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. అయితే ట్రక్ డ్రైవర్ పారిపోయినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. Also read: KGF Chapter 2: కేజీఎఫ్ 2 బిగ్ సర్‌ప్రైజ్ వచ్చేసింది
ట్యాంకర్ డిజీల్ ట్యాంకుకు కారు బలంగా తాకడంతోనే మంటలు చేలరేగి ఉంటాయని ఆగ్రా డీఎం ప్రభు ఎన్ సింగ్ తెలిపారు. ఇంకా చనిపోయిన వారిని గుర్తించలేదని, కారు నంబరు ఆధారంగా వివరాలు తెలుసుకుంటున్నట్లు వివరించారు. అయితే ఈ ఘటనపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ (Yogi Adityanath) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. Also read: Sonu Sood: రియల్ హీరోకు గుడి కట్టిన తెలంగాణ ప్రజలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook