AIADMK: దక్షిణాదిన బీజేపీకు షాక్, ఎన్డీయే నుంచి వైదొలగిన ఏఐఏడీఎంకే
AIADMK: దక్షిణాదిన ఎన్డీయేకు షాక్ తగిలింది. ఇన్నాళ్లూ మిత్రపక్షంగా ఉన్న ఏఐఏడీఎంకే పొత్తు తెంచేసుకుంది. తమిళనాడు బీజేపీ ఛీఫ్ వివాదాస్పద వ్యాఖ్యలే ఇందుకు కారణం. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
AIADMK: తమిళనాడుకు చెందిన అన్నాడీఎంకే పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది. బీజేపీతో పొత్తును తెంచుకుంటున్నట్లు ప్రకటించడమే కాకుండా ఎన్డీయే నుంచి వైదొలగుతున్నట్టు వెల్లడించింది. రెండు పార్టీల మధ్య బంధం ఎందుకు చెడిందో తెలుసుకుందాం..
దక్షిణాదిన బీజేపీకు మిత్రపక్షంగా, ఎన్డీయే భాగస్యామ్య పార్టీగా ఉన్న ఏఐఏడీఎంకే కీలక నిర్ణయం తీసుకుంది. ఇన్నాళ్లూ బీజేపీతో ఉన్న బంధాన్ని తెంచుకుంటున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు తమిళనాడు పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన సమావేశంలో నిర్ణయం తీసుకుంది. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, ద్రావిడ దిగ్గజం సీఎన్ అన్నాదురైపై తమిళనాడు ఛీఫ్ కె అన్నామలై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలే రెండు పార్టీల మధ్య పొత్తు చెడటానికి కారణమైంది. 1956లో మధురైలో జరిగిన ఓ కార్యక్రమంలో అన్నాదురై హిందూమతాన్ని అవమానించారనే ఆరోపణలు రాష్ట్రంలో వివాదం రేపాయి. ఆ సందర్బంలో అన్నాదురైను దాచి పెట్టారని, క్షమాపణలు కోరడంతో తప్పించుకున్నారంటూ అన్నామలై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
దివంగత ముఖ్యమంత్రిని అవమానిస్తే తామెలా ఊరుకుంటామని అన్నాడీఎంకే నేతలు మండిపడుతున్నారు. మా నేతలపై విమర్శలు చేస్తుంటే ఎందుకు సహించాలని ప్రశ్నిస్తున్నారు. ఇక్కడ బీజేపీ బలమెంతో తమకు తెలుసని, బీజేపీని ఇక్కడెందుకు మోయాలని అడుగుతున్నారు.
Also read: UP Slapping Case: ముస్లిం విద్యార్ధి చెంపదెబ్బ కేసులో సుప్రీంకోర్టు సీరియస్, ప్రభుత్వానికి చీవాట్లు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook