కేంద్రంపై మమతా బెనర్జీ ఘాటు విమర్శలు..
కరోనా మహమ్మారి దేశవ్యాప్తంగా గత కొన్ని రోజులుగా వేగంగా ప్రబలుతున్న నేపథ్యంలో రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ సమావేశమయ్యారు. కాగా ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి దేశవ్యాప్తంగా గత కొన్ని రోజులుగా వేగంగా ప్రబలుతున్న నేపథ్యంలో రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ సమావేశమయ్యారు. కాగా ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ సమావేశంలో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. గత కొన్ని రోజులుగా కేంద్ర ప్రభుత్వానికి, పశ్చిమ బెంగాల్ కి మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ సమావేశం సందర్భంగా కేంద్ర ప్రభుత్వంపై పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విమర్శలు గుప్పించారు. రాష్ట్రాల మధ్య వివక్ష చూపిస్తూ అనవసర రాద్ధాంతాలు సృష్టిస్తోందని, కేంద్ర ప్రభుత్వం విపత్కర పరిస్థితుల్లో రాజకీయాలు చేస్తోందని ఆమె మండిపడ్డారు.
Also Read: రైలు ప్రయాణానికి మార్గదర్శకాలు
పథకం ప్రకారమే కేంద్రం, రాష్ట్రంపై దాడిచేస్తోందని, కేంద్రం వ్యవహరాన్ని బెంగాల్ ప్రజలు సహించబోరని, రాజకీయాలకు ఇది సమయం కాదని ఆమె అన్నారు. తమ అభిప్రాయాలను ఇంత వరకు ఎవరూ అడగలేదని, ఫెడరల్ వ్యవస్థను కూల్చవద్దని అన్నారు. ఈ సంక్షోభ సమయంలో కేంద్రానికి తాము పూర్తిగా సహకరిస్తున్నామని, అయినప్పటికీ తమపై ఎదురు దాడి చేస్తున్నారని వాపోయారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..