Mamata Banerjee: హెలికాప్టర్ ఎక్కుతుండగా కిందపడిన మమతా బెనర్జీ.. వైరల్ గా మారిన వీడియో..
Mamata Banerjee: వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ చీఫ్ మమత బెనర్జీ శనివారం ఎన్నికల ప్రచారానికి వెళ్తుండగా అనుకోని ఘటన చోటు చేసుకుంది. హెలికాప్టర్ లోపల ఆమె ఎక్కుతుండగా కాలు జారీ కింద పడిపోయారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Mamata Banerjee slips and falls while helicopter boarding in durgapur: పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ శనివారం అనుకోని ఘటన ఎదురైంది. దుర్గాపూర్ లో హెలికాప్టర్ ఎక్కి సీట్లో కూర్చోబోతుండగా ఆమె ఒక్కసారిగా కాలు జారి పడిపోయారు. ఈ ఘటనలో ముఖ్యమంత్రి మమత బెనర్జీ కి స్వల్ప గాయం అయినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆమెను భద్రత సిబ్బంది.. పూర్తిగా కింద పడకుండా ఆమెను పట్టుకున్నట్లు సమాచారం. మమతా బెనర్జీ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం మధ్యాహ్నం పశ్చిమ్ వర్ధమాన్ జిల్లాలోని హెలికాప్టర్ లోపలికి వెళ్లారు. అప్పుడు ఒక్కసారిగా బ్యాలెన్స్ తప్పిపోయి కిందపడిపోయారు. వెంటనే భద్రత సిబ్బంది అలర్ట్ అయి ఆమెను సీటులోకూర్చోబెట్టినట్లు సమాచారం. వెంటనే మమతకు ఆమె దగ్గర ఉండే వైద్యులు.. ప్రథమ చికిత్స అందించారు. ఆ తర్వాత మమత బెనర్జీ ఎన్నికల ప్రచారం కోసం అసన్సోల్ కు వెళ్లారు. ఇదిలా ఉండగా.. ప్రమాదం జరిగినప్పటికీ, బెనర్జీ కుల్టీకి వెళ్లి తృణమూల్ కాంగ్రెస్ అసన్సోల్ అభ్యర్థి శత్రుఘ్న సిన్హాకు మద్దతుగా ర్యాలీలో ప్రసంగించారు.
ఇదిలా ఉండగా.. కొన్నినెలల క్రితమే మమతా ఇలాంటి ప్రమాదానికి గురయ్యారు. దీంతో ఆమె తలకు తీవ్రగాయమైన విషయం తెలిసిందే. మమతా బెనర్జీకి తలకు తీవ్ర గాయం కాగా.. ఆ గాయం నుంచి రక్తం ధారగా కారుతున్నట్లు ఉంది. ముఖంపైన నుంచి రక్తం కారుతూ కళ్లపై నుంచి ముక్కు, నోరు నుంచి మెడ వరకు రక్తం కారినట్లు ఆ ఫోటోలో కనిపిస్తోంది. వ్యాయామం చేస్తూ ఉండగా మమతా కింద పడిపోవడంతో ఆమె నుదుటికి ఏదో వస్తువు గట్టిగా తగిలినట్లు కన్పిస్తుంది. ఈ క్రమంలో ఇప్పుడు మరోసారి హెలికాప్టర్ లో పడిపోవడం పట్ల ఆమె అభిమానులు, పార్టీ నేతలు తీవ్ర ఆందోళనవ్యక్తంచేస్తున్నారు. దీదీకి ఎలాంటి ప్రమాదాలు జరగకూడదంటూ ప్రత్యేకంగా ప్రార్థనలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉండగా దేశంలో ప్రస్తుతం ఎన్నికల హీట్ కొనసాగుతుంది. అధికారంలో ఉన్న బీజేపీ తమకు భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రచారం నిర్వహిస్తుంది. మరోవైపు.. అపోసిషనల్ ఇండియాకూటమి కూడా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. పదేళ్లపాటు మోదీ దేశంలోని ప్రజలకుచేసిందేమీ లేదంటూ విమర్శిస్తున్నారు. ఇక .. మమతా బెనర్జీ, పీఎం మోదీని అవకాశం దొరికినప్పుడల్లా విరుచుకుపడుతుంటారు. ఎట్టి పరిస్థితులల్లో బీజేపీ నిర్ణయాలను, వెస్ట్ బెంగాల్ లో అమలుపర్చేది లేదంటూ మమతా కుండబద్దలు కొట్టినట్లు ఆరోపణలు చేస్తుంటారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter