West Bengal CM మమతా బెనర్జీ పోటీ చేసేది అక్కడినుంచే, ఆ సీటు దీదీదే అంటున్న నేత
Mamata Banerjee: రాష్ట్రంలోని 292 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో టీఎంసీ 213 సీట్లలో ఘనవిజయం సాధించినా సీఎం మమతా బెనర్జీ మాత్రం నందిగ్రామ్‌లో ఓటమిపాలయ్యారు. ఆమె ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే దానిపై తాజాగా స్పష్టత వచ్చింది.
ఇటీవల జరిగిన పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ ఘన విజయం సాధించి వరుసగా మూడోసారి అధికారి హస్తగతం చేసుకుంది. రాష్ట్రంలోని 292 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో టీఎంసీ 213 సీట్లలో ఘనవిజయం సాధించినా సీఎం మమతా బెనర్జీ మాత్రం నందిగ్రామ్‌లో ఓటమిపాలయ్యారు. ఆరు నెలల్లోగా ఆమె ఎన్నికల్లో విజయం సాధించి ఎమ్మెల్యే కావాల్సి ఉన్న తరుణంలో ఓ ఎమ్మెల్యే దీదీ మమతా బెనర్జీ కోసం రాజీనామా చేశారు. దాంతో ఆమె ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే దానిపై స్పష్టత వచ్చింది.
టీఎంసీ ఎమ్మెల్యే శోభన్‌దేవ్ ఛటోపాధ్యాయ (భవానీపూర్ నియోజకవర్గం) శుక్రవారం తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా లేఖను పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ స్పీకర్ మిమన్ బందోపాధ్యాయకు సమర్పించారు. సీఎం మమతా బెనర్జీ అదే స్థానం నుంచి ఉప ఎన్నికల బరిలో దిగనున్నారని రాజీనామా చేసిన ఎమ్మెల్యే శోభన్‌దేవ్ ఛటోపాధ్యాయ స్పష్టం చేశారు. మమతా బెనర్జీ (Mamata Banerjee) సీఎం సీట్లో కూర్చున్నారు, కానీ ఆరు నెలల్లోగా శాసనసభకు ఎన్నిక కావాల్సి ఉందని, ఈ తరుణంలో తాను రాజీనామా చేశానని చెప్పారు. భవానీపూర్ నుంచి సీఎం మమతా బెనర్జీ రెండు పర్యాయాలు విజయం సాధించారని, మరోసారి ఇదే స్థానం నుంచి పోటీ చేయనున్నారని తెలిపారు.
Also Read: West Bengal Cabinet: పశ్చిమ బెంగాల్‌లో జంబో కేబినెట్
ప్రభుత్వాన్ని నడిపే సత్తా కేవలం మమతా బెనర్జీకి మాత్రమే ఉందని, అందుకోసమే తాను పదవికి రాజీనామా చేశానని చెప్పారు. తనపై ఎవరూ ఒత్తిడి చేయలేదని, తాను మమతా బెనర్జీ స్థానం నుంచి పోటీ చేసి ఆ సీటును రక్షించానని.. ఇప్పుడు దీదీకే ఆ సీటును అప్పగిస్తున్నానని పేర్కొన్నారు. గత రెండు అసెంబ్లీ ఎన్నికల్లోనూ పశ్చిమ బెంగాల్ (West Bengal) మమతా బెనర్జీ భవానీపూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. తొలిసారి లక్ష మెజార్టీ రాగా, 2016లో మెజార్టీ ఇరవై అయిదు వేలకు పడిపోయింది.
Also Read: Covid-19 Symptoms: ఆ కరోనా బాధితులకు Steroids వాడకూడదు, ప్రముఖ వైద్యుడి సలహా
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నందిగ్రామ్ నుంచి పోటీ చేయాలని బీజేపీ నేతలు సవాల్ విసరగా, తనకు పట్టులేకున్నా మమతా బెనర్జీ దైర్యంగా ఆ స్థానం నుంచి పోటీ చేశారు. కానీ చివరివరకూ ఉత్కంఠగా జరిగిన ఓట్ల లెక్కింపులో టీఎంసీని వీడి బీజేపీలో చేరిన సువేందు అధికారి మమతపై విజయం సాధించారని తెలిసిందే. సిట్టింగ్ ఎమ్మెల్యే శోభన్‌దేవ్ ఛటోపాధ్యాయ రాజీనామాతో టీఎంసీ అభ్యర్థిగా మమతా బెనర్జీ మరోసారి భవానీపూర్ నియోజవర్గం నుంచి పోటీ చేయనున్నారు.
Also Read: AP Parishad Elections: ఏపీ ప్రభుత్వానికి షాక్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు రద్దు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook