Lockdown: మాస్కులు, శానిటైజర్స్ పంచుతున్న నేటి గాంధీ
ఏ స్వార్థం లేకుండా ప్రజాహితం కోసం చేసే సేవ ఏదైనా వారిని గొప్ప వాళ్లను చేస్తుంది. కరోనావైరస్ కాటేస్తోన్న ఈ కష్టకాలంలో ముఖానికి మాస్కులు ధరించడం, తరచుగా హ్యాండ్ శానిటైజర్స్‌తో చేతులు శుభ్రం చేసుకోవడం ఎంతో అవసరం. కానీ నిత్యం రెక్కాడితే కానీ డొక్కాడని నిరుపేదలకు లాక్‌డౌన్ సమయంలో ఆహారం లభించడమే కష్టం! వారికి మాస్కులు, హ్యాండ్ శానిటైజర్స్ గురించి అవగాహన కల్పించేదెవరు ? అందించేదెవరు ?
భువనేశ్వర్: ఏ స్వార్థం లేకుండా ప్రజాహితం కోసం చేసే సేవ ఏదైనా వారిని గొప్ప వాళ్లను చేస్తుంది. కరోనావైరస్ కాటేస్తోన్న ఈ కష్టకాలంలో ముఖానికి మాస్కులు ధరించడం, తరచుగా హ్యాండ్ శానిటైజర్స్‌తో చేతులు శుభ్రం చేసుకోవడం ఎంతో అవసరం. కానీ నిత్యం రెక్కాడితే కానీ డొక్కాడని నిరుపేదలకు లాక్‌డౌన్ సమయంలో ఆహారం లభించడమే కష్టం. ఏ పూటకు ఆ పూటే ఆహారాన్ని వెతుక్కునే ఆ నిరుపేదలకు మాస్కులు, హ్యాండ్ శానిటైజర్స్ గురించి అవగాహన కల్పించేదెవరు ? వాటిని చేతికి అందించేదెవరు ? Also read : మార్చి 29న 979, ఇప్పుడు 8356 కరోనా పాజిటివ్ కేసులు.. కారణమేంటో తెలుసా..
[[{"fid":"184297","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]
ఇదిగో ఈ ఫోటోలో కనిపిస్తున్న ఈ వ్యక్తికి కూడా సరిగ్గా ఇలాగే అనిపించిందేమో.. అందుకే ఇలా జాతిపిత వేషం వేసుకుని, మాస్కులు, హ్యాండ్ శానిటైజర్స్ అనే అస్త్రాలను చేతపట్టుకుని కరోనాపై యుద్ధానికని ఓ మురికివాడకు బయల్దేరాడు. Also read : రేపు లాక్ డౌన్ పొడగింపుపై స్పష్టత
[[{"fid":"184298","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"2":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"2"}}]]
జాతిపిత మహాత్ముడు ఏం చెప్పినా వింటారు కదా అనుకున్నట్టున్నాడు.. అందుకే ఆ జాతిపిత వేషంలో జాతీయ జండాను కూడా చేతపట్టుకుని వెళ్లి వెళ్లి ప్రస్తుత లాక్‌డౌన్ సమయంలో సోషల్ డిస్టన్సింగ్, మాస్కులు ధరించాల్సిన అవసరం, హ్యాండ్ శానిటైజర్స్ వినియోగంపై వారికి అవగాహన కల్పించడమే కాకుండా వారికి మాస్కులు, శానిటైజర్స్ కూడా ఉచితంగా పంచిపెట్టాడు. ఒడిషా రాజధాని భువనేశ్వర్‌లోని ఎయిమ్స్ ఆస్పత్రికి సమీపంలోని మురికివాడల్లో కెమెరాకు చిక్కిన ఫోటోలు ఇవి. Also read : Lockdown: ఆల్కాహాల్ లేదని శానిటైజర్, షేవింగ్ క్రీమ్ లోషన్ తాగారు
[[{"fid":"184299","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"3":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"3"}}]]
ఇంట్లోంచి బయటికొస్తే కరోనా వైరస్ దాడి చేసే ప్రమాదం ఉందనే భయాన్ని సైతం లెక్కచేయకుండా.. నలుగురి శ్రేయస్సు కోసం వారి వద్దకే వెళ్లి మాస్కులు, శానిటైజర్స్ పంచిపెడుతున్న ఈ మహాత్ముడితో పాటు.. నిత్యం నిరుపేదల ఆకలి తీరుస్తున్న ఇంకెందరో మహానుభావులను మనం అభినందించి తీరాల్సిందే. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..