Train Viral News: భారత రైల్వే మంత్రిత్వ శాఖ షేర్ చేసిన ఓ సీసీటీవీ ఫుటేజ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రైలు పట్టాలపై ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకుంటున్న క్రమంలో.. అది గమనించిన ట్రైన్ డ్రైవర్ (లోకో పైలెట్) చాకచక్యంగా ఎమెర్జెన్సీ బ్రేక్ వినియోగించి ఆ వ్యక్తిని ప్రాణాపాయం నుంచి కాపాడాడు. ముంబయిలోని శివాడీ రైల్వే స్టేషన్ లో జరిగిన ఈ ఘటన సీసీటీవీలో రికార్డు అయ్యింది. ఇప్పుడా వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఏం జరిగిందంటే?


ముంబయిలోని శివాడీ రైల్వే స్టేషన్ వద్ద ఆ అనూహ్య సంఘటన జరిగింది. శివాడీ స్టేషన్ అప్పుడే ఓ లోకల్ ట్రైన్ రాబోతుంది. దాన్ని గమనించిన ఓ అనూమానాస్పద వ్యక్తి పట్టాలపై ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించాడు. రైలు తన సమీపానికి చేరుకునే లోపు అతడు పట్టాలపై అడ్డంగా పడుకున్నాడు. 


అలా రైలు పట్టాలపై పడుకొని ఉండగా.. ఆ వ్యక్తిని గమనించిన రైలు డ్రైవర్ (లోకో పైలెట్) వెంటనే ట్రైన్ ఎమర్జెన్సీ బ్రేక్ ను వినియోగించిన రైలును నిలుపుదల చేశాడు. అదే సంఘటనను గమనించిన స్టేషన్ లోని రైల్వే పోలీసు అధికారులు పరుగెత్తుకుంటూ వెళ్లి పట్టాలపై పడుకున్న వ్యక్తిని కాపాడి తీసుకొచ్చారు. ఒకవేళ ట్రైన్ డ్రైవర్ (లోకో పైలెట్) అతడ్ని గమనించకపోయుంటే ఆ వ్యక్తి ప్రాణాలు కోల్పోయేవాడు. 


ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇది చూసిన నెటిజన్లు ట్రైన్ డ్రైవర్ (లోకో పైలెట్) చేసిన పనికి మెచ్చుకుంటున్నారు. అదే విధంగా వ్యక్తి కాపాడేందుకు స్టేషన్ లోని రైల్వే పోలీసులు పరుగెత్తుకుంటూ వెళ్లిన వారిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. 


ఇప్పటి వరకు ఈ వీడియోకు 1,08,400 వ్యూస్ తో పాటు 6,646 లైక్స్ వచ్చాయి. దాదాపుగా 960 మందికి పైగా రీట్వీట్ చేశారు. అసలు ఆ వైరల్ వీడియోలో ఏముందో ఒకసారి మీరే చూసేయండి. 



Also Read: Goa Viral Video: గోవాలో కొవిడ్ రూల్స్ గాలికొదిలి.. థార్డ్ వేవ్​కు రాయల్ వెల్​కం!


Also Read: Flipkart Services: ఫ్లిప్‌కార్ట్‌లో సాంకేతిక సమస్య, కస్టమర్ల ఇబ్బందులు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి