ప్రతీకార దాడిలో, ఏడుగురు యువకులు (సంఘ్ పరివార్) ముస్లిం వ్యక్తిపై దాడి చేసి చంపారు. ఈ ఘటన జనవరి 3న హిందూ కార్యకర్త దీపక్‌రావు హత్య చేయబడ్డ తరువాత జరిగింది. బాధితుడు 47 ఏళ్ల అహ్మద్ బషీర్‌గా గుర్తించబడ్డాడు. బషీర్ తీవ్రమైన గాయాల బారిన పడడంతో ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. కానీ పరిస్థితి విషమించడంతో ఆయన మృతి చెందారు. దుండగులను నిఘా కెమెరాల ద్వారా పట్టుకున్నామని.. హత్యకు ప్రతీకారమే కారణమని తెలిపారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మంగళూరు పోలీస్ కమిషనర్ టి.ఆర్. సురేష్ దాడికి యత్నించిన యువకులను  25 ఏళ్ల శ్రీజిత్ పికెగా, కాసర్గోడ్‌కు జిల్లాకు చెందిన 21 ఏళ్ల సందేశ్ కొట్యాన్ అని గుర్తించారు.  అలాగే, మంగళూరు పడిల్‌కు చెందిన సోదరులు - 22 ఏళ్ల ధనుష్ పూజరి,  21 ఏళ్ల కిషన్ పూజరిగా గుర్తించారు. 


మైనారిటీ వర్గానికి చెందిన వ్యక్తిని లక్ష్యంగా పెట్టుకుని దీపక్‌రావు మరణానికి ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకున్నారు. ఆ నేపథ్యంలోనే దురదృష్టవశాత్తు బషీర్ మృతి చెందారు


బషీర్ మరణ వార్తతో మంగళూరులో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఏజే హాస్పిటల్‌లో శవపరీక్ష అనంతరం అతని మృతదేహాన్ని అప్పగించారు. వార్త విన్న వెంటనే మంత్రి యూటీ ఖాదర్ ఆసుపత్రికి వచ్చి కుటుంబసభ్యులను పరామర్శించారు. బాధితులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కాగా రాష్ట్ర ప్రభుత్వం మృతుడి కుటుంబానికి 10 లక్షల రూపాయల పరిహారం ప్రకటించింది. 


"రాష్ట్రంలో శాంతియుత వాతావరణానికి అందరూ సహకరించాలి. తీరప్రాంతాల్లోని ప్రజలు విద్యావంతులుగా ఉంటారు. ఈ ప్రదేశాల్లో అలాంటి విషయాలు జరగకూడదు. వారు అమాయక ప్రజలను హతమార్చడం మరియు సమస్యను రాజకీయం చేయడం మానివేయాలి" అన్నారు సీఎం సిద్దరామయ్య.