Manish Sisodia And Satyendar Jain Resigns: ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ప్రధాన నిందితుడు అని సీబీఐ చెబుతున్న ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, ఆరోగ్య మంత్రి సత్యేందర్ జైన్ మంగళవారం రాజీనామా చేశారు. ఆరోపిత ఎక్సైజ్ స్కామ్‌కు సంబంధించి సిసోడియా ఐదు రోజుల సిబిఐ రిమాండ్‌లో ఉండగా, ఆరోగ్య మంత్రి సత్యేందర్ జైన్ మనీలాండరింగ్ కేసులో ఇప్పటికే జైలులో ఉన్నారు. మనీష్ సిసోడియాను సీబీఐ ఆదివారం అరెస్టు చేసిందన్న సంగతి అందరికీ గుర్తుండే ఉంటుంది, ఆ అనంతరం ఆయనని సోమవారం కోర్టులో హాజరుపరచగా ఐదు రోజుల రిమాండ్‌ విధించారు. ఇక సీబీఐ చర్యకు వ్యతిరేకంగా సిసోడియా మంగళవారం నాడు సుప్రీంకోర్టును ఆశ్రయించినా అక్కడ ఆయనకు ఎలాంటి ఉపశమనం లభించలేదు. సుప్రీంకోర్టు హైకోర్టును ఆశ్రయించాలని కోర్టు సూచించింది. ఢిల్లీలో ఉన్న అంశం కాబట్టి నేరుగా సుప్రీంకోర్టును ఆశ్రయించాల్సిన అవసరం లేదని జస్టిస్ పీఎస్ నరసింహ పేర్కొన్నారు. ఉప ముఖ్యమంత్రి సిసోడియాకు బెయిల్ విషయంలో చాలా ఆప్షన్స్ ఉన్నాయని కూడా ఆయన అన్నారు. ఇక ఇపుడు ఆయన ఢిల్లీ హైకోర్టుకు వెళ్లి ఈ విషయాన్ని సవాల్ చేయాల్సి ఉంటుంది. ఈ విషయంలో మేం జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. ఇక సుప్రీంకోర్టు సలహా మేరకు ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పుడు ఈ విషయాన్ని హైకోర్టుకు తీసుకెళ్లనుందని అంటున్నారు, ఇక ఈ అంశం మీద స్పందిస్తూ కోర్టును గౌరవిస్తున్నామని పార్టీ పేర్కొంది.
Also Read: Genelia D'souza Kids Doing Namaste: ఇదే కదా సంస్కారం అంటే.. ఫోటోగ్రాఫర్లకు జెనీలియా పిల్లలు నమస్కారం!


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Naga Shaurya Fight: లవర్ ను రోడ్డుపై కొట్టిన యువకుడు.. రచ్చ చేసిన నాగశౌర్య!