ఛత్తీస్ గఢ్ ( Chattisgarh ) లో మావోయిస్టులు మరోసారి పంజా విసిరారు. అదును చూసి భద్రతాబలగాలపై దాడులకు దిగుతున్న మావోయిస్టుులు ( Maoists ) మరో ఘాతుకానికి తెగబడ్డారు. సీఏఎఫ్ ( CAF Camp ) శిబిరంపై దాడి చేసి కాల్పులు జరిపారు. నారాయణ పూర్ లోని దూల్ వద్ద ఉన్న సీఏఎఫ్ ( ఛత్తీస్ గడ్ ఆర్మ్ డ్ ఫోర్స్ ) ( Chattisgarh Armed Force ) పై మావోయిస్టులు దాడి చేశారు. ఓ జవాను మృతి చెందాడు. భద్రతా సిబ్బంది తేరుకునేలోగా..మావోయిస్టులు పరారయ్యారు. కేవలం మెరుపుదాడి చేసి ఉనికి చాటుకునే ప్రయత్నంగా తెలుస్తోంది. ఇద్దరు ముగ్గురు సభ్యుల టీమ్ చేసి ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మావోయిస్టు అమరవీరుల వారోత్సవాలను అడ్డుకుంటున్న సాయుధ బలగాలతో పోటీగా ఇప్పటికే ఆంధ్ర-ఒరిస్సా బోర్డర్ ( Andhra Odissa ) లో ఎదురుకాల్పులు సంఘటనలు ఎక్కువయ్యాయి. ఈ నేపధ్యంలో ఇప్పుడు ఛత్తీస్ గఢ్ లో మావోయిస్టులు దాడికి తెగబడటం కలవరం రేపుతోంది. Also read: Visakha Agency: మన్యంలో ఎదురుకాల్పులు...భయంతో గిరిజనం