భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని హత్య చేసేందుకు మావోయిస్టులు వేసుకున్న ప్లాన్²ను గుర్తించిన పూణే పోలీసులు.. వారి ఇంటర్నల్ కమ్యూనికేషన్ వ్యవస్థను భగ్నం చేశారు. గతేడాది నుంచే ఆయన హత్యకు మావోయిస్టులు ప్రణాళికలు రచిస్తున్నారని గుట్టురట్టయింది. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ ఎల్టీటీఈ హతమార్చిన తరహాలోనే ప్రధాని మోదీని హత్య చేయాలనుకున్నారని పుణే పోలీసులు చెప్పారు. అందుకు సంబంధించిన ఓ లేఖను శుక్రవారం విడుదల చేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ ఏడాది జనవరి మహారాష్ట్రలోని భీమా కోరేగాంలో జరిగిన హింసాత్మక ఘటనకు సంబంధించి కేసులో ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. అందులో ఓ నిందితుడి ఇంటి నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్న లేఖ తాజాగా కలకలం రేపుతోంది.



 


మోదీ పాలనను అంతమొందించాలని కామ్రెడ్లు ప్రతిపాదించినట్లు, మోదీని హత్య చేసేందుకు విఫలమయ్యే అవకాశమున్నా రోడ్ షో సమయంలో టార్గెట్ చేయడం ఉత్తమమని ఆ లేఖలో అభిప్రాయపడ్డారు. మోదీని ఎలా హత్య చేయాలో మావోయిస్టులు లేఖల ద్వారా చర్చించుకోవడం ఈ లేఖలో స్పష్టంగా ఉంది. ఈ ఏడాది ఏప్రిల్ 17న వారు ఈ లేఖ రాసినట్లు స్పష్టమైంది.