Luthiana Fire Accident: పంజాబ్ రాష్ట్రంలో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ అగ్ని ప్రమాదంలో ఏడుగురు సజీవ దహనమయ్యారు. ప్రమాద కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పంజాబ్‌లోని లూథియానాలో జరిగిన ఘోర అగ్ని ప్రమాదమిది. నగరంలోని తాజ్‌పూర్ రోడ్డులోని ఓ గుడిసెలో అర్ధరాత్రి సమయంలో హఠాత్తుగా మంటలు చెలరేగాయి. ఆ సమయంలో ఆ గుడిసెలో భార్యభర్తలతో పాటు ఐదుగురు పిల్లలు నిద్రిస్తున్నారు. తెల్లవారుజామున 2-3 గంటల ప్రాంతంలో మంటలు విస్తరించినట్టు తెలుస్తోంది. అంతా అక్కడికక్కడే సజీవదహనమయ్యారు. ఈ ఏడుగురిలో ఏడాది వయసున్న చిన్నారి కూడా ఉన్నాడు. మరో కుమారుడు 17 ఏళ్ల రాజేశ్ ఆ సమయంలో మరో చోట నిద్రిస్తుండటంతో ప్రాణాలతో మిగిలాడు. సమీపంలోని సుందర్‌ నగర్ నుంచి అగ్నిమాపక సిబ్బంది మంటల్ని అదుపు చేసింది. అగ్ని ప్రమాదానికి కారణాలేంటనేది ఇంకా తెలియలేదు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. మృతుల్లో ఐదుగురు చిన్నారులు కావడంతో అక్కడి దృశ్యం దయనీయంగా మారింది. 


మృతులంతా వలస కార్మికులని పోలీసులు చెబుతున్నారు. ప్రమాదం జరిగిన గుడిసె సమీపంలో మున్సిపాలిటీ గార్బేజ్ స్టోర్ ఉంది. 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook