Viral Post:  సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అంటే ఎంతో క్రేజ్. తమ కూతుళ్లను  సాఫ్ట్ వేర్ ఇంజనీర్ తో మ్యారేజీ చేయాలని పేరెంట్స్ తహతహలాడేవారు. కోట్లాది రూపాయలు కట్నం ఇవ్వడానికి కూడా ముందుకు వచ్చేవారు. సాఫ్ట్ వేర్ ఇంజనీర్లకు ఐదెంకల వేతనాలు ఉండటం.. విదేశాల్లో ఉద్యోగం చేసే అవకాశం ఉండటంతోనే పేరెంట్స్ అలా ఆలోచించేవారు. కాని ప్రస్తుతం సీన్ మారిపోయినట్లు కనిపిస్తోంది. తాజాగా ఒక మ్యారేజీ బ్యూరో ప్రకటనలో వచ్చిన ప్రకటన ఆసక్తిగా మారింది. వైరల్ గా మారింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తమకు వరుడు కావాలంటూ ఓ అమ్మాయి వాళ్ల పేరెంట్స్ ఇచ్చిన ప్రకటన అందరిని ఆశ్చర్యపరుస్తోంది. సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ అయితే మాకొద్దూ అంటూ ఆ ప్రకటనలో ప్రత్యేకంగా ప్రస్తావించారు. సంపన్న బిజినెస్ ఫ్యామిలీకి చెందిన కుటుంబం మ్యారేజీ ప్రకటన ఇచ్చింది. ఎంబీఏ పూర్తి చేసిన వధువుకు వరుడు కావాలని పేర్కొంది.ఐఏఎస్, ఐపీఎస్ ,డాక్టర్, పారిశ్రామికవేత్త లేదా వ్యాపారవేత్త కావాలని కోరింది. అయితే సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లు మాత్రం తమకు వద్దంటూ స్పష్గంగా తెలియజేశారు.


ఈ మ్యారేజీ ప్రకటనకు సంబంధించిన పేపర్ క్లిప్ ను ప్రముఖ బిజినెస్ మెన్ సమీర్‌ అరోరా తన ట్విట్టర్ అకౌంట్ లో షేర్ చేశారు. ప్రస్తుతం ఐటీ రంగం భవిష్యత్ సజావుగా కనిపించడం లేదని ఆయన కామెంట్ చేశారు.  సమీర్‌ అరోరా  చేసిన పోస్ట్ వైరల్ గా మారింది.



దీనిపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. దేశంలో ఎక్కువ మంది సాఫ్ట్ వేర్ ఇంజనీర్లే ఉన్నారని.. ఈ లెక్కన దేశ భవిష్యత్ కూడా సజావుగా లేనట్టేనని ఓ నెటిజన్ కామెంట్ చేశారు. తాము అంత బ్యాడా అంటూ ఒక సాఫ్ట్ వేర్ ఇంజనీర్ తన ఆవేదన వ్యక్తం చేశాడు. ఓ మై గాడ్ ... నాకు 11 ఏళ్ల క్రితమే పెళ్లి జరిగింది.. ఇప్పుడైతే పరిస్థితి ఏంటీ అంటూ మరొక సాఫ్ట్ వేర్ ఇంజనీర్ సెటైర్ వేశాడు.


Also read: Dasara Holidays in Telangana: తెలంగాణలో దసరా సెలవులు తగ్గించనున్నారా ? ఫుల్ డీటేల్స్ ఇదిగో


Also read:  Munugode Bypoll: కేసీఆర్ సమీక్ష చేసిన రోజే షాక్.. మునుగోడు సీనియర్ నేత జంప్.. మంత్రి జగదీశ్ రెడ్డి కారణమా?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook