Covid-19 Vaccine: నేడే మెగా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం
దేశవ్యాప్తంగా కోట్లాది మంది ఎదురుచూస్తున్న క్షణం రానేవచ్చింది. కరోనావైరస్ మహమ్మారి వ్యాప్తిని అరికట్టేందుకు మెగా వ్యాక్సినేషన్ ప్రక్రియ మరికొంత సేపట్లో ప్రారంభంకానుంది.
Mega Coronavirus vaccination drive to begin in India today | న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కోట్లాది మంది ఎదురుచూస్తున్న క్షణం రానేవచ్చింది. కరోనావైరస్ (Covid-19) మహమ్మారి వ్యాప్తిని అరికట్టేందుకు మెగా వ్యాక్సినేషన్ ప్రక్రియ మరికొంత సేపట్లో ప్రారంభంకానుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు ఉదయం 10:30 గంటలకు వర్చువల్ ద్వారా కోవిడ్ వ్యాక్సినేషన్ (Coronavirus vaccination) ప్రక్రియను లాంఛనంగా ప్రారంభించనున్నారు. అనంతరం ప్రధాని మోదీ (PM Narendra Modi) వ్యాక్సిన్ లబ్ధిదారులతో మాట్లడనున్నారు. Also Read: COVID-19 Vaccine తీసుకున్నవారిలో ఏ లక్షణాలు కనిపిస్తాయంటే..
అయితే దేశ వ్యాప్తంగా 3,006 ప్రదేశాల్లో ఒకేసారి వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభంకానుంది. తొలి రోజు ఒక్కొక్క కేంద్రంలో 100 మందికి చొప్పున ప్రభుత్వం టీకాలు ఇవ్వనుంది. మొత్తం మీద 3లక్షల మందికి కోవిడ్ టీకాను ఇవ్వనున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆరోగ్య, ఐసీడీఎస్ సిబ్బందికి వ్యాక్సిన్ వేయనున్నారు. కో-విన్ యాప్ ద్వారా దేశవ్యాప్తంగా జరిగే కరోనా వ్యాక్సిన్ ప్రక్రియను అధికారులు పరిశీలించనున్నారు. ఎప్పటికప్పుడు అధికారులు ఆన్‌లైన్‌లో పర్యవేక్షిస్తూ సలహాలు సూచనలు ఇవ్వనున్నారు. Also Read: Coronavirus New Strain: దేశంలో 114కు చేరిన న్యూ స్ట్రేయిన్ కేసులు
కరోనా వ్యాక్సిన్ ప్రక్రియను (Covid-19 vaccination drive) 24గంటలపాటు పర్యవేక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక కాల్ సెంటర్‌ను ఏర్పాటు చేసింది. టీకాల పంపిణీ, ఇతర సందేహాల నివృత్తికి ప్రత్యేక టోల్‌ఫ్రీ నంబర్ - 1075ను ఏర్పాటు చేశారు. కరోనా మహమ్మారి నివారణకు ఇప్పటికే దేశ వ్యాప్తంగా కోవిషీల్డ్, కోవ్యాక్సిన్ టీకాలు సరఫరా అయిన విషయం తెలిసిందే.
Also Read: Farm Laws: అసంపూర్ణంగానే ముగిసిన చర్చలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook