karnataka congress rally news: కర్ణాటకలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. ఆ రాష్ట్రంలో భారీగా కొవిడ్ కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో వివాదస్పదంగా మారిన ‘'మేకెదాటు'’ పాదయాత్రను (Congress Padyatra) నిలిపేస్తున్నట్లు కాంగ్రెస్‌ పార్టీ గురువారం ప్రకటించింది.  మేకెదాటు ప్రాజెక్టు విషయంలో భాజపా ప్రభుత్వాన్ని నిలదీసేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమ ప్రారంభోత్సవంలో పాల్గొన్న రాజ్యసభ ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge), సీనియర్‌ నేత వీరప్ప మొయిలీ తదితరులకు కొవిడ్ బారిన పడ్డారు. ఈ నేపథ్యంలో.. పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) పిలుపు మేరకు పాదయాత్రను నిలిపేస్తున్నట్లు పార్టీ నేతలు గురువారం  ప్రకటించారు. 



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కొవిడ్ నిబంధనలను ఉల్లఘించారంటూ.. వివాదాస్పద పాదయాత్ర ఐదో రోజున 60 మందికి పైగా కాంగ్రెస్ నాయకులపై ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి. కావేరి నదిపై మేకేదాటు డ్యాం ప్రాజెక్టు కోసం నిర్వహిస్తున్న పాదయాత్రను విరమించుకోవాలని ఈరోజు తెల్లవారుజామున ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై (CM Basavaraj Bommai).. సిద్ధరామయ్య, రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్‌లకు లేఖ రాశారు. ఈ పాదయాత్రకు ఎందుకు అనుమతి ఇచ్చారని? దాన్ని ఆపేందుకు ఎందుకు చర్యలు తీసుకోలేదని కర్ణాటక హైకోర్టు బుధవారం రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. నిబంధనలు ఉల్లంఘిస్తూ.. వందలాదిమంది ఈ ర్యాలీలో పాల్గొంటుండటంపై పెద్దఎత్తున విమర్శలు వస్తోన్న విషయం తెలిసిందే. భాజపా నేతలు దీన్ని ‘'సూపర్ స్ప్రెడర్'’ ర్యాలీగా అభివర్ణిస్తున్నారు. 


Also Read: Mallikarjun Kharge: కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మల్లికార్జున ఖర్గేకు కొవిడ్ పాజిటివ్‌


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి