హరియాణాలో ఓ ముస్లిం యువకుడి గెడ్డాన్ని కొందరు వ్యక్తులు బలవంతంగా గీయించిన ఘటన ఇటీవలె వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. దీనిపై ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. దీన్ని హైయమైన చర్యగా పేర్కొన్న ఓవైసీ..నిందితులను త్వరలోనే ముస్లింలుగా మార్చి వారితో గెడ్డం పెంచేలా చేస్తానని ఈ సందర్భంగా సవాలు విసిరారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఓవైసీ మాట్లల్లో చెప్పాలంటే ‘‘ మా వర్గానికి చెందిన యువకుడి గెడ్డాన్ని తొలగిస్తారా ?  నేను వారి తల్లిదండ్రుకు చెబుతున్నా వినండి. మీరు మా గొంతులు కోసినా మేం ముస్లింలమే. ఇలాంటి దుర్మార్గపు చర్యలు మానుకోమని చెప్పండి..  ఈ చర్యకు పాల్పడినందుకు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు.. మిమ్మల్ని కూడా త్వరలోనే ముస్లింలుగా మార్చి... గెడ్డాలతో తిరిగేలా చేస్తాం’’ అని ఓవైసీ హెచ్చరించారు. 


గురుగ్రామ్‌లోని సెక్టార్ 29లో ఆగస్టు 2వ తేదీన ఈ ఘటన జరిగింది. యువకుడిని బలవంతంగా ఈడ్చుకెళ్లిన ముగ్గురు నిందితులు అతడి గడ్డాన్ని షేవ్ చేశారు.  కాగా ఈ ఘటనపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఈ కేసులో ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది.