Asaduddin owaisi: పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ రంగంలో దిగుతున్నారు.  ముస్లింల ప్రాబల్యమున్న ప్రాంతాలపై దృష్టి పెట్టేలా వ్యూహ రచన చేస్తున్నారు. మరి కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమిలో ఎంఐఎం చేరుతుందా లేదా..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

హైదరాబాద్ నుంచి బీహార్, మహారాష్ట్రలకు పార్టీని విస్తరించిన అసదుద్దీన్ ఒవైసీ( Asaduddin owaisi ) ఇప్పుడు పశ్చిమ బెంగాల్‌పై దృష్టి పెట్టారు. బెంగాల్ ఎన్నికల్లో అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే పశ్చిమ బెంగాల్‌లో పర్యటించిన అసదుద్దీన్ ఒవైసీ మరోసారి పర్యటించనున్నారు. ఈ నెల 25న కోల్‌కత్తాకు చేరుకుని..ముస్లింల ప్రాబల్యమున్న మాటియాబుర్జ్ ప్రాంతంలో ఎన్నికల సమావేశాన్ని నిర్వహించి..తరువాత పాదయాత్ర ( Padayatra ) చేసే యోచనలో ఉన్నారు. ఇతర పార్టీలతో కలిసి ఎన్నికల్లో పోటే చేసే అంశంపై ఒవైసీ చర్చించనున్నారని తెలుస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్ వామపక్ష పార్టీలు కల్సి పోటీ చేస్తున్నాయి. మరి ఒవైసీ కాంగ్రెస్ వామపక్ష కూటమిలో చేరనున్నారా లేదా అనేది ఇంకా తేలలేదు. దీనిపై ఊహాగానాలైతే ప్రారంభమయ్యాయి.


ఈ ఏడాది ప్రారంభంలో జనవరి నెలలో పర్యటించిన ఒవైసీ..హుగ్లీ జిల్లాలోని పుర్పురా షరీఫ్ దర్గాలో పీర్జాదా అబ్బాస్ సిద్ధీఖీతో బేటీ అయ్యారు. అనంతరం పీర్జాదా అబ్బాస్ నేతృత్వంలో పశ్చిమ బెంగాల్ ఎన్నిక ( West Bengal Elections )ల్లో ఎంఐఎం( MIM ) పోటీ చేస్తుందని ఒవైసీ ప్రకటించారు. అయితే కొద్దిరోజుల క్రితం ఒవైసీ నమ్ముకున్న సిద్దీఖీ...సొంతంగా పార్టీ స్థాపించి కాంగ్రెస్ కూటమితో కలిసి ఎన్నికల బరిలో దిగేందుకు చర్చలు జరుపుతున్నారు. లెఫ్ట్‌ఫ్రంట్ , కాంగ్రెస్ పార్టీలు ఇటీవలే ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ పరిణామంతో బెంగాల్‌లో పరిణామాలు ఆసక్తిగా మారాయి. ముర్షిదాబాద్, మాల్డా, ఉత్తర దక్షిణ దినాజ్‌పూర్, దక్షిణ-ఉత్తర 24 పరగణాలు, హుగ్లీ, కోల్‌‌కత్తాలోని ముస్లిం ఆధిపత్య స్థానాలపై అటు ఒవైసీ, ఇటు సిద్ధీఖీలు దృష్టి సారించారు. 


Also read: FASTag: ఫాస్టాగ్ ఉచితంగా ఎలా తీసుకోవాలో తెలుసా..అలా ఉంటే టోల్‌ప్లాజా ఫీజు కూడా ఉండదు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - 
https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook