హైదరాబాద్ : పౌరసత్వ సవరణ చట్టం (CAA), జాతీయ పౌర పట్టిక (NRC), జాతీయ జనాభా పట్టిక (NPR)కు వ్యతిరేకంగా ఎంఐఎం (MIM) పార్టీ ఆందోళనలను తీవ్రతరం చేసింది. పౌరసత్వ సవరణ బిల్లు చట్టరూపం దాల్చకముందు నుంచే నిరసన తెలియజేస్తున్న ఆ పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసి శుక్రవారం సీఏఏ, ఎన్ఆర్‌సి, ఎన్‌పిఆర్‌కు వ్యతిరేకంగా ఆన్‌లైన్ క్యాంపెయిన్ ప్రారంభించారు. అందులో భాగంగానే సీఏఏ, ఎన్ఆర్‌సి, ఎన్‌పిఆర్‌కు వ్యతిరేకంగా గళం వినిపించే వారు రాజ్యాంగంలోని ప్రవేశికను తమతమ భాషల్లో చదివి వినిపిస్తూ ఆ వీడియోలను ట్విటర్‌, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, టిక్‌టాక్, యూట్యూబ్‌తో పాటు ఇతర సామాజిక మాథ్యమాల్లో పోస్ట్ చేయాల్సిందిగా అసదుద్దీన్ ఒవైసి కోరారు. రాజ్యాంగంలోని ప్రవేశిక ఏం చెబుతోంది ? ప్రవేశిక విలువలు ఏంటనే వివరాలను చదువుతున్న వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో పాటు 'మేరా సంవిధాన్', 'వి ద పీపుల్ ఆఫ్ ఇండియా' అనే హ్యాష్ ట్యాగ్స్‌తో ఎవరైనా మరో ముగ్గురు స్నేహితులను ట్యాగ్ చేయాల్సిందిగా అసదుద్దీన్ ఒవైసి నెటిజెన్స్‌కి విజ్ఞప్తి చేశారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Read also : CAA myths and facts : పౌరసత్వ సవరణ చట్టం: అపోహలు- నిజాలు


జనవరి 26 రిపబ్లిక్ డే సందర్భంగా ఆ రోజు వరకు ఈ ఆన్‌లైన్ క్యాంపెయిన్ నిర్వహించడం ద్వారా పౌరసత్వ సవరణ చట్టం, జాతీయ పౌర పట్టిక, జాతీయ జనాభా పట్టికపై ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉందనే విషయాన్ని ప్రధాని మోదీకి తెలిసొచ్చేలా చేయాలని అసదుద్దీన్ ఒవైసి తెలిపారు.


ఇదిలావుంటే, శుక్రవారం రాజస్తాన్‌లోని జోధ్‌పూర్‌లో పర్యటించిన కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా.. పౌరసత్వ సవరణ చట్టం, జాతీయ పౌర పట్టిక, జాతీయ జనాభా పట్టికకు వ్యతిరేకంగా ఆందోళనలు నిర్వహిస్తున్న వారిని ఏకిపారేసిన సంగతి తెలిసిందే. ''ఎవరెన్ని కుట్రలు చేసినా దేశ ప్రయోజనాలు, రక్షణ కోసం తీసుకొచ్చిన చట్టాలను అమలు చేయడంలో అంగుళం కూడా వెనుకడుగేయం'' అని అమిత్ షా స్పష్టంచేశారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..