మినాల్ దఖావే భోస్లే... ఈ పేరు నిన్న మొన్నటి వరకు ఎవరికీ పెద్దగా తెలియదు. కానీ ఆమె పేరు నేటి నుంచి భారత దేశం మొత్తం మారు మోగి పోయింది. ఆమె ఎవరో కాదు.. భారత దేశంలో తొలిసారిగా 'కరోనా వైరస్' నిర్ధారించేందుకు టెస్ట్ కిట్ కనుక్కున్న అసాధారణ మహిళ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కూతురుకు జన్మనిచ్చే ఒక రోజు ముందు.. ఆమె  కరోనా టెస్ట్ కిట్  కనుక్కోవడం విశేషం. అంతే కాదు. 'కరోనా వైరస్' వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ఆమె తన పరిశోధనలకు పదును పెట్టారు. కేవలం ఆరు వారాల్లో ఈ ఘనతను సాధించారు. పుణేలో ఆమె వైరాలజిస్టుగా పని చేస్తున్నారు. పుణేలోని మై ల్యాబ్ రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ వింగ్ కు చీఫ్ గా వ్యవహరిస్తున్నారు. ఒక టెస్ట్ కిట్ తో 100 శాంపిల్స్ పరీక్ష చేసే అవకాశం ఉంది. అంతే కాదు.. దీని ధర కూడా చాలా తక్కువ. కేవలం 12 వందల రూపాయల్లో 'కరోనా వైరస్'ను నిర్ధారించవచ్చు. ప్రస్తుతం  విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న టెస్ట్ కిట్ల ద్వారా ఎక్కువగా ఖర్చవుతోంది. దానిలో కేవలం పావు శాతం మాత్రమే మినాల్ దఖావే భోస్లే కనిపెట్టిన టెస్ట్ కిట్ కు ఖర్చు కావడం విశేషం.


5 నిముషాల్లోనే 'కరోనా' పరీక్ష 


టెస్ట్ కిట్ పై పరిశోధన చేస్తున్న సమయంలో మినాల్ దఖావే భోస్లే నిండు గర్భిణీగా ఉన్నారు. ఆమె డెలివరీ కోసం ఆస్పత్రికి వెళ్తున్న సమయంలో అంటే మార్చి 18న తన పరిశోధన నివేదికను నేషనల్ ఇన్సిట్యూట్ ఆఫ్ వైరాలజీకి సమర్పించారు. మార్చి 19న ఆమె కూతురుకు జన్మనిచ్చారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..