'కరోనా వైరస్' ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో గుబులు పుట్టిస్తోంది. అన్ని దేశాల్లో మరణ మృదంగం మోగిస్తోంది. రోజు రోజుకు వేగంగా వ్యాపిస్తూ ప్రభుత్వాలకు చుక్కలు చూపిస్తోంది. ఐతే వ్యాధి నిర్దారణకు ఆలస్యం కావడం ఇందులో ప్రధాన కారణంగా కనిపిస్తోంది. ఇప్పటి వరకు కరోనా వైరస్ ను త్వరగా గుర్తించేందుకు ఎలాంటి పరీక్షలు అందుబాటులో లేకపోవడమే కారణం.
ఐతే ఇప్పుడిప్పుడే పరిశోధనా సంస్థలు .. ఆ విధంగా ముందుకు అడుగులు వేస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు 10 నిముషాల్లోనే 'కరోనా వైరస్' పరీక్షలను అందుబాటులోకి తెచ్చిన పరిశోధనా సంస్థలు.. తాజాగా ఆ సమయాన్ని 5 నిముషాలకు కుదించాయి. ఇందులో భాగంగా అమెరికాకు చెందిన అబాట్ అనే పరిశోధనా సంస్థ.. ఓ కిట్ ను తయారు చేసింది. కేవలం 5 నిముషాల్లోనే 'కరోనా వైరస్'ను నిర్ధారించే వీలు కలిగేలా కిట్ తయారు చేసింది. దీనికి అమెరికా ప్రభుత్వం నుంచి ఆమోదముద్ర కూడా పడడం విశేషం.
BREAKING: We’re launching a test that can detect COVID-19 in as little as 5 minutes—bringing rapid testing to the frontlines. https://t.co/LqnRpPpqMM pic.twitter.com/W8jyN2az8G
— Abbott (@AbbottNews) March 27, 2020
బీహార్‌లో బర్డ్ ఫ్లూ, స్వైన్ ఫ్లూ..!!
మరో వారం రోజుల్లో ఈ కిట్ ను అందుబాటులోకి తీసుకొస్తామని అబాట్ కంపెనీ ప్రకటించింది. ఐతే ప్రస్తుతం అమెరికాలో మాత్రమే ఇది అందుబాటులో ఉంటుందని .. ఆ తర్వాత ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో కిట్ ను అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపింది. అంతే కాదు కొత్తగా తయారు చేసిన కిట్ ద్వారా రోజుకు 50 వేల మందికి కరోనా పరీక్షలు చేయవచ్చని కంపెనీ ప్రకటించింది.
అలాగే పాజిటివ్ రిజల్ట్ వచ్చే అవకాశం ఉన్న పక్షంలో కేవలం 5 నిముషాల్లోనే ఫలితం తెలిసిపోతుంది. ఒకవేల నెగెటివ్ ఫలితం వచ్చే అవకాశం ఉన్నప్పుడు రిజల్ట్ రావడానికి 13 నిముషాల సమయం పడుతుంది. నెలకు 50 లక్షల కిట్లను ఉత్పత్తి చేసే సామర్థ్యం తమకు ఉందని అబాట్ కంపెనీ ప్రకటించింది. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..